NBK108: బాలయ్య మూవీ నుంచి మరో లీక్.. ఫ్లాష్‌బ్యాక్‌లో అక్కడ ఊచకోత.. పోస్టర్‌లో అందుకే పెట్టారా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా స్టార్ హీరోగా హవాను చూపిస్తూ.. ఇప్పటికీ అదే జోష్‌తో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరింత ఉత్సాహంతో కనిపిస్తోన్న ఆయన.. ఇప్పుడు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్టును చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం.. అంచనాలకు తగ్గట్లుగానే తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ హైలైట్ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన బాలయ్య

మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన బాలయ్య

చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బంది పడ్డ నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను తీసిన 'అఖండ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. ఈ ఉత్సాహంతోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'వీరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా కూడా బిగ్ హిట్ అయింది.

అనిల్ రావిపూడితో క్రేజీ ప్రాజెక్ట్

అనిల్ రావిపూడితో క్రేజీ ప్రాజెక్ట్

'వీరసింహారెడ్డి' మూవీ పట్టాలపై ఉన్నప్పుడే నటసింహా నందమూరి బాలకృష్ణ.. తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తున్నారని తెలిసింది. దీనికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

అప్పుడే మొదలు.. బ్రేకుల్లేవుగా

అప్పుడే మొదలు.. బ్రేకుల్లేవుగా

బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తైన తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ చిత్రం షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశం లేదని టాక్ వినిపించింది. కానీ, ఇటీవలే చిత్రీకరణను పున: ప్రారంభించి ఏమాత్రం బ్రేకులు లేకుండా షూటింగ్‌ను జరుపుతున్నారు.

దసరాకు రిలీజ్ చేస్తున్నారుగా

దసరాకు రిలీజ్ చేస్తున్నారుగా

అనిల్ రావిపూడి - నందమూరి బాలకృష్ణ కలయికలో రూపొందుతోన్న సినిమాను ఎప్పుడు విడుదల చేయాలని టార్గెట్ చేశారో తెలియక ముందే.. దీన్ని దసరా కానుకగా తీసుకు వస్తారని ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇటీవలే ఈ సినిమాను అదే పండుగకు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌నూ విడుదల చేశారు.

అలాంటి స్టోరీతో వస్తోన్న మూవీ

అలాంటి స్టోరీతో వస్తోన్న మూవీ

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా.. ముప్పై ఏళ్ల వయసులో జైలు శిక్ష పడి.. నాలుగు గోడల మధ్య జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి కథతో రూపొందుతోందని ఎప్పుడో ఓ న్యూస్ లీకైంది. అతడి గురించి నిజం తెలియని కూతురు ద్వేషించడం.. ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకుని తండ్రి కోసం తపన పడడం అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి.

బాలయ్య సినిమాలో హైలైట్‌గా

బాలయ్య సినిమాలో హైలైట్‌గా

ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో ఫస్టాఫ్ అంతా బాలయ్య జైలులోనే కనిపిస్తారని ముందే చెప్పుకున్నాం. ఆయనకు, కూతురి పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయని తెలిసింది. అలాగే, ఫ్లాష్‌బ్యాక్ వచ్చే యాక్షన్ సన్నివేశాలు దుమ్ము దులిపేలా ఉంటాయట. అందులో బాలయ్య మార్క్ సీన్స్‌ను జోడించారని తాజాగా తెలిసింది.

ఊచకోత... అందుకే పోస్టర్‌లో

ఊచకోత... అందుకే పోస్టర్‌లో

బాలయ్యలోని ఎన్నో యాంగిల్స్ చూపించే విధంగా రూపొందుతోన్న ఈ సినిమాను తెలంగాణ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి గతంలోనే చెప్పాడు. అయితే, తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోల్‌కతా బ్యాగ్‌డ్రాప్‌తో సాగుతుందట. అందుకే రిలీజ్ డేట్ పోస్టర్‌లో కాళికా మాత ఫొటోను కూడా జోడించారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X