విశ్వంభరలో ఆ ఎపిసోడ్ నెక్ట్ లెవెల్ అంతే.. చిరంజీవి నుంచి ఊహించిన ట్రీట్
టాలీవుడ్‌లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన రీతిలో హవాను చూపిస్తూ టాప్ హీరోగా దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేసిన ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలనే ఎక్కువగా చేస్తున్నారు. అలా ఇప్పుడు చిరంజీవి నటిస్తోన్న సినిమానే 'విశ్వంభర'.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమాగా 'విశ్వంభర'ను చేస్తున్న విషయం తెలిసిందే. 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతుంది. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే, ఇప్పుడు మరో షెడ్యూల్ ప్రారంభించగా.. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్ త్రిష కూడా భాగం అయింది.
చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజింగ్ అంశాలను కూడా పెడుతున్నారు. దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఈ సమాచారం ప్రకారం.. ఇందులో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న 'విశ్వంభర'లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందని అంటున్నారు. ఇందులో హీరో లుక్, విజువల్స్ ఎవరూ ఊహించని రీతిలో ఉంటాయని సమాచారం. ముఖ్యంగా ఆ సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ క్రేజీగా డిజైన్ చేశారట. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, రానా, శింబు తదితరులు విలన్‌గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











