Bhagavanth Kesari: భగవంత్ కేసరి ఫ్లాష్‌బ్యాక్ లీక్.. ఊహించని పాత్రలో బాలయ్య.. ఇదేం ట్విస్టురా సామీ!
ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ.. ఇప్పటికీ తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నారు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన.. మరింత జోష్‌తో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేశారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లీకైంది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
బాలయ్య.. భగవంత్ కేసరిగా:నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన క్రేజీ మూవీనే 'భగవంత్ కేసరి'. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్‌గా చేశాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

యమ సందడి.. ఎక్కువగా:బాలకృష్ణ హీరోగా చేసిన 'భగవంత్ కేసరి' మూవీని అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు కూడా నిర్వహించారు. అలాగే, మరిన్ని కార్యక్రమాలూ చేయబోతున్నారు. దీంతో 'లియో', 'టైగర్ నాగేశ్వర్రావు' ఉన్నా ఈ సినిమా సందడే ఎక్కువగా కనిపిస్తోంది.
పాజిటివ్ బజ్‌తో వస్తుంది:డిఫరెంట్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో 'భగవంత్ కేసరి'పై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఇది మంచి బజ్‌తోనే విడుదల కాబోతుంది.

అంతటా కుమ్మేస్తుందిగా:మాస్ హీరో, క్లాస్ డైరెక్టర్ కలిసి చేసిన 'భగవంత్ కేసరి' మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్‌లో ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. అక్కడ దీనికి విశేషమైన స్పందన వస్తోంది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో సోమవారమే బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇక, ఇక్కడైతే కొన్ని గంటల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో షోలు ఫుల్ అయిపోతున్నాయి.
మూవీ ఫ్లాష్‌బ్యాక్ హైలైట్:ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న 'భగవంత్ కేసరి' మూవీ తండ్రి కూతురు సెంటిమెంట్‌తో రాబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అలాగే, ఈ సినిమా గురించి ఎన్నో రకాల అంశాలు కూడా లీక్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ హైలైట్‌గా ఉండబోతుందని ఓ న్యూస్ లీకైంది. ఇది దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుందట.

మరోసారి ఆ పాత్రలోనే:'భగవంత్ కేసరి' సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి సర్‌ప్రైజ్ చేయబోతున్నారని తెలిసింది. ఇందులో ఆయన ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నారని అంటున్నారు. ఇదే సినిమాకు ప్రాణంలా నిలుస్తుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు అన్నీ రెట్టింపు అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











