ప్లాప్ హీరోయిన్ కి భారీ పారితోషికం
వరుస పరాజయాలతో ప్లాపు హీరోయిన్ గా మారిన ఇలియానా చేతిలో ప్రస్తుతం పెద్ద గా సినిమాలేవీ లేవు. శక్తి భారీ డిజాస్టర్, ఆత్వాత నేను నా రాక్షసి సినిమా కూడా ప్లాపు, తెలుగు కాకుండా అమ్మడు ఇతర భాషల్లో నటించిన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిన ఈ గోవా సుందరిని దర్శకులంతా కొన్ని రోజులుగా దూరం పెట్టారు. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్ మూవీ బర్ఫీ(సెకండ్ హీరోయిన్), శంకర్ తీయబోతున్న త్రీఇడిట్స్ తప్ప ఏమీ లేవు.
అయితే తన కెరీర్ ఇంత చెత్తగా సాగుతున్నా పారితోషికం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు ఇలియాన. సూపర్ స్టార్ రజినీ కాంత్ 'రాణా" సినిమాలో దీపిక తర్వాత సెంకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ఇలియాన...కేవలం 15 రోజుల కాల్షీట్లు ఇచ్చినందుకు గానూ నిర్మాతల దగ్గర నుంచి రూ. 60 లక్షలు వసూలు చేసింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ అయిన దీపిక పారితోషికం రెండు నెలలకు గాను రూ. 2 కోట్లు. రోజుల ప్రకారం చేసుకుంటే ఇలియాన పారితోషికం దీపికకంటే ఎక్కువే.


Click it and Unblock the Notifications











