జూ ఎన్టీఆర్-సురేందర్ రెడ్డిల బ్యాడ్ టేస్ట్...!
జూ ఎన్టీఆర్ 'రచ్చ" సినిమా లో 'ప్రయాణం" చిత్రంలో నటించిన పాయల్ ఘోష్ (హారిక)కథానాయికగా నటిస్తుందని సమాచారం. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా పాయల్ ని ఓకే చేసుకున్నారు. అయితే హీరోయిన్ గా జూ ఎన్టీఆర్ సరసన సరిపోదని, చూడ్డానికి చాలా ఘోరంగా ఉందని తొలి సినిమాతో ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న పాయల్ ని ఇందులో కథానాయికగా ఎలా ఎంచుకున్నాడనేది సురేందర్ కే తెలియాలి. కంత్రిలో రెండో హీరోయిన్ గా నటించిన కాజోల్ చెల్లి తనీషా గుర్తుంది కదా? చూడ్డానికి మగాడిలా ఉండే ఆ పిల్లని హీరోయిన్ గా భరించలేక అభిమానులే కళ్లు మూసుకున్నారు. మళ్ళీ రచ్చకి కూడా పాయల్ వల్ల అదే పరిస్థితి ఏర్పడుతుందని అభిమానులు కలత చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











