twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్ బాడీగార్డుకి పువ్వుల సమస్య

    By Srikanya
    |

    ప్రస్తుతం వెంకటేష్ మలయాళంలో హిట్ అయిన బాడీగార్డ్ ను తెలుగులోకి గంగ...ది బాడీగార్డ్ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో రెండు పాటలు మినహా షూటింగ్ ముగిసింది. ఈ రెండు పాటలను కెనడాలో షూట్ చేద్దామని యూనిట్ బయల్దేరారు. అక్కడ గార్డెనింగ్ ఫ్లవర్స్ బాగుంటాయని వారు నిర్ణయం తీసుకున్నారు. దాహిలాస్, లిజంతాస్, హైపర్ నైకం, డెల్ఫినియం, సన్ ఫ్లవర్స్ వంటి పువ్వులు ప్రపంచ ప్రసిద్ది. అక్కడ షూటింగ్ చేద్దామనుకున్నారు. అయితే ఆ పూలు కేవలం అక్టోబర్ లో మాత్రమే పూస్తాయి. కాబట్టి గంగ టీమ్ కూడా లేటయినా, అక్కడే పాటలు బాగా తీయాలనే ఉద్దేశంతో పూలు పూచే వరకు ఎదురుచూడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

    అందుకు అనుగుణంగా షూటింగ్ ను సెప్టంబర్ 29 నుంచి అక్టోబర్ 10 వరకు వాయిదా వేసుకున్నారని సమాచారం. మరో ప్రక్క సల్మాన్ ఖాన్ సినిమాను చూసి వచ్చిన వెంకి అందులో హైలెట్ అయిన వాటిని ఎడాప్ట్ చేయమని కోరుతున్నాడుట.అంతేగాక ఆల్రెడీ తీసేసిన సీన్స్ ను మళ్ళీ రీషూట్ చేద్దామని పట్టుపడుతున్నాడట. హీరోనే అత్యుత్సాహం ల్లచూపిస్తూండటంతో నిర్మాత బెల్లంకొండ కూడా ఏమీ అనలేని పరిస్దితి నెలకొని ఉంది. ఇదే సినిమా తమిళ రీమేక్ లో విజయ్, అసిన్ జత కట్టారు.అయితే తమిళ సినిమా ఆడలేదు. హిందీ వెర్షన్ లో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ చేసారు. గతంలో వెంకీ, త్రిష కలిసి 'ఆడువారి మాటలకు అర్థాలు వేరులే', 'నమో వేంకటేశ' సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.

    English summary
    The destruction done by Salman Khan at Tollywood BO with Bodyguard released is going to adversely affect the output of Venkatesh's Bodyguard.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X