ఆర్ఆర్ఆర్: విదేశీ బ్యూటీతో రొమాన్స్ చేయబోతున్న ఎన్టీఆర్?
Recommended Video

ఎవరి అంచనాలకు అందని విధంగా, ఎవరి ఊహలకు చిక్కని విధంగా దర్శకుడు రాజమౌళి సినిమాలు ఉంటాయి. ఈ ప్రత్యేకతలతో పాటు ప్రేక్షకులను సంతృప్తి పరిచే అన్ని అంశాలు తెరపై ఆవిష్కరింపజేయడం జక్కన్న స్టైల్. అందుకే ఆయన అపజయం ఎరుగని దర్శకుడిగా ఎదిగారు. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో భారతీ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్స్ అందుకోగల సత్తా ఉందని నిరూపించారు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా 'ఆర్ఆర్ఆర్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమూవీలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఎన్టీఆర్‌కు జోడీగా విదేశీ నటి
ఎన్టీఆర్‌కు జోడీగా విదేశీ నటి ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఆమె ఎంపిక కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ నటి పేరు బయటకు పొక్కకుండా చిత్ర బృందం జాగ్రత్తలు తీసుకుంటోంది.

విదేశీ నటి అవసరం ఏమిటి?
ఈ చిత్రం బ్రిటిష్ కాలం నాటి కథతో రూపొందుతోందని, ఎన్టీఆర్ బంధిపోటుగా కనిపించబోతున్నారని... ఈ క్రమంలో ఆయనతో రొమాన్స్ చేసే బ్రిటిష్ అమ్మాయి పాత్రలో విదేశీ నటి కనిపించబోతున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది.

రామ్ చరణ్‌కు జోడీగా...
రామ్ చరణ్ ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అతడికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అలియా వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోతోంది. మరి ఈవిడే ఫైనల్ అవుతుందా? లేక మరొకరిని తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.

కోల్‌కతాలో నెక్ట్స్ షెడ్యూల్
‘ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ కోల్‌కతాలో ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. డివివి దానయ్య రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా...ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











