జూ.ఎన్టీఆర్..నేషనల్ ట్రెజర్
ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్లో అశ్వనీదత్ ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం పారెస్ట్ ఎడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. నిధి అన్వేషణ చుట్టూ కథ తిరుగుతుందని వినపడుతోంది. హాలివుడ్ హీరో నికొలేస్ కేజ్ నటించిన నేషనల్ ట్రెజర్ ఆధారంగా ఈ కథ రెడీ అయ్యిందని వినపడుతోంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం షూటింగ్ లో ఎక్కువబాగం ఉత్తర భారతదేశంలోని ఎంపికచేసిన ప్రాంతాల్లో చేస్తారు. అంతేగాక మూడు దేశాల్లో ఈ చిత్రంలోని పాటలు,సన్నివేశాలు తీయటానికి నిర్ణయించారు. దీన్ని ఒక పూర్తి స్ధాయి మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దనున్నట్లు నిర్మాతలు చెప్తున్నారు.గతంలో అశ్వనీదత్, ఎన్టీఆర్ కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ వన్, కంత్రి వచ్చాయి.ఇక మెహర్ రమేష్ తన కంత్రి చిత్రంలో ఎక్కువ భాగం బ్యాంకాక్ లో తీస్తే తదుపరి భిళ్లాను మలేషియాలో తీసారు. అలాగే గతంలోనూ ఎన్టీఆర్ తో చేసిన కంత్రి చిత్రం మేచిస్టిక్ మేన్ ఆధారంగా మెహర్ రమేష్ రూపొందించాడన్న సంగతి తెలిసిందే.ఏదైమైనా త్వరలో ఎన్టీఆర్ అభిమానులు డిఫెరెంట్ గెటప్ లోనే కాక డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ లో తమ హరోని చూడబోతున్నారన్నమాట.


Click it and Unblock the Notifications











