న్యూ ట్రెండ్: మహేశ్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. నాలుగు సార్లు రిలీజ్ చేస్తారట.!

By Manoj

తన గత చిత్రం 'మహర్షి' సక్సెస్‌ అవడంతో జోష్ మీదున్నాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ఈ ఫలితంతో అదే ఊపులో మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. అదే.. 'సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, సాంగ్స్‌కు భారీ స్పదన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

 ఆ సినిమాల్లో లాగే ఇందులో కూడా..

ఆ సినిమాల్లో లాగే ఇందులో కూడా..

‘సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా కనిపించినప్పటికీ కామెడీ ట్రాక్‌కే పెద్ద పీట వేశారని తెలుస్తోంది. సీరియస్ బోర్డర్ సీక్వెన్సెస్ తర్వాత మహేష్ కాశ్మీర్ నుంచి ఇంటికి వచ్చే ఎపిసోడ్ ఆసక్తికరంగా ప్లాన్ చేశారట. ఇందుకోసం ట్రైన్‌లో మహేష్, ఇతర నటీనటులతో హిలేరియస్ కామెడీ పండించాలని డిసైడ్ అయిన అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట. మొత్తంగా ఈ సినిమా అనిల్ మార్క్ కంటెంట్‌తో వస్తుందట.

సరికొత్త ప్రయోగం చేస్తున్నారు

సరికొత్త ప్రయోగం చేస్తున్నారు

సాధారణంగా కమర్షియల్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఇలానే ట్రెండ్ కొనసాగింది. అయితే, ‘సరిలేరు నీకెవ్వరు'లో మాత్రం రెండు స్పెషల్ సాంగ్స్ పెట్టబోతున్నారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ట్యూన్స్‌ను మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పటికే రెడీ కూడా చేసేశాడని అంటున్నారు. ఇవి కూడా పక్కా మాస్ మసాలా సాంగ్స్ అని తెలిసింది.

షూటింగ్ అయ్యాక అదే పని

షూటింగ్ అయ్యాక అదే పని

ఈ సారి సంక్రాంతికి పలు సినిమాల నుంచి ‘సరిలేరు నీకెవ్వరు'కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అల.. వైకుంఠపురములో' ప్రభావం భారీగానే పడనుంది. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమా ప్రమోషన్ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందుకోసం దర్శకుడు అనిల్ రావిపూడి సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నారని టాక్.

మహేశ్ సినిమాతో న్యూ ట్రెండ్

మహేశ్ సినిమాతో న్యూ ట్రెండ్

ఇక, ప్రమోషన్‌లో భాగంగా ‘సరిలేరు నీకెవ్వరు' బృందం చేసే పనుల్లో టీజర్ కట్స్ గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించి నాలుగు టీజర్లను రిలీజ్ చేయబోతున్నారట. ఈ నాలుగు నాలుగు రకాలుగా ఉంటాయని తెలుస్తోంది. అంటే.. ఒకటి సీరియస్ మోడ్, మరొకటి కామిక్ టీజర్ ఇలా మరో రెండు రకాల టీజర్లు కట్ చేయబోతున్నారని సమాచారం. నవంబర్ చివరి వారం నుంచి ఇవి రిలీజ్ చేస్తారని తెలిసింది.

Recommended Video

#CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
సరిలేరు నీకెవ్వరు గురించి

సరిలేరు నీకెవ్వరు గురించి

సూపర్ స్టార్ మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా లేడీ అమితాజ్ విజయశాంతి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. అలాగే బండ్ల గణేష్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X