»   » ఆ స్టార్ హీరో ఫ్రెండ్షిప్ తోనే, కోస్టార్ తో లవ్ లో పడిన తాప్పీ...?!

ఆ స్టార్ హీరో ఫ్రెండ్షిప్ తోనే, కోస్టార్ తో లవ్ లో పడిన తాప్పీ...?!

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు కుర్రాళ్ళను రెచ్చగొట్టిన తాప్సీ మిస్టర్ ఫర్ ఫెక్ట్ తో తనలో మంచి నటి కూడా ఉందని నిరూపించింది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాలోనూ నటిస్తూ దక్షిణాదిన అభిమానులను, కాసులను బాగానే సంపాదిస్తుంది. ఇప్పుడు దక్షినాది టాప్ అయిదుగురు హీరోయిన్లు పేర్లు చెబితే అందులో తాప్సీ ఉండాల్సింది.

  సొట్టబుగ్గల హాట్ లేడీ తాప్సీ ఇప్పుడు చాలా బిజీగా వుంది. సినిమాలలో అనుకుంటున్నారా... అంతలేదులెండి... బయట ప్రేమలో బిజీగా వుంది. కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ న్యూస్ ఇదే..! మహత్ రాఘవేంద్ర అనే తమిళ నటుడితో తాప్సీ 'స్నేహం' ముదిరి పాకాన పడుతోందని కోలీవుడ్ కోడై కూస్తోంది. షూటింగులోనే కాకుండా... పార్టీలలోనూ, పబ్బులలోనూ... ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ప్రేమజంటే కనపడుతోందట. తమిళ నటులు మన్హత్ రాఘవేంద్ర, కమెడియన్ ప్రేమ్ జీ అమరాన్ తాప్సీకి మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో ఆమె తరచూ వీరితో కలిసి కపిస్తుండటంతో.....తాప్సీ-మన్హత్ మధ్య 'సం"బంధం ఏదో ఉందని గుసగుసలు మొదలయ్యాయి.

  తమిళంలో స్టార్ హీరోగా పేరుతెచ్చుకొన్న శింబు ఫ్రెండ్స్ లో మన్హత రాఘవేంద్ర ఒక్కరు. శింబు ద్వారా తాప్సీ పరిచయం అయి, అద కాస్తా ప్రేమగా మారిందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తు, దాంతో, చెన్నయ్ మీడియా వాళ్లు వీళ్లిద్దరి వ్యవహారంపైనా తెగరాసిపారేస్తున్నారు. అయితే, షరా మామూలుగా... ఈ అమ్మడు మాత్రం 'ప్రేమా లేదు... గీమా లేదు... మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే' అంటూ కొట్టిపారేస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా మీడియా తన మీద గాసిప్స్ రాయడం మానడం లేదని చికాకు పడుతోంది. అయితే, మీడియా మాత్రం 'మా చెవుల్లో క్యాబేజీ పెట్టకు తల్లీ' అంటూ తాప్సీకి సలహా ఇస్తోంది!

  English summary
  Mahat Raghavendra of Chennai is an upcoming Tamil artiste. He is a friend of hero Simbu and others. It is through these friends that Tapsee came to know Mahat Raghavendra. The friendship between the two has transformed into love, says the Tamil film buzz. Some Tamil papers have also written about the romance of the two. However, neither Tapsee nor Mahat has responded to these reports. Let’s wait and watch to know if this romance was true.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more