‘గబ్బర్’ ఎఫెక్ట్ : మహేష్-క్రిష్ మూవీ ఇప్పుడు లేనట్లేనా?

తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన 'ఠాగూర్' చిత్రాన్ని హిందీలో 'గబ్బర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాత. ఈ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం దక్కించుకున్నారు క్రిష్.
ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో చేసే సినిమా వాయిదా వేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. 'గబ్బర్' సినిమా పూర్తయిన తర్వాత మహేష్ తో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బేనర్ పై ఈచిత్రం రూపొందనుంది.
ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసినట్లు క్రిష్ వెల్లడించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. గమ్యం', 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సిసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











