‘గబ్బర్ సింగ్' 100 రోజులపై సాడ్ న్యూస్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్ సింగ్' వంద రోజులు ఆగస్టు 17కి పూర్తవుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం వంద రోజులు పంక్షన్ ని ఆగస్టు 18 లేదా ఆగస్టు 19న చేసే అవకాసముందంటూ వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లో అభిమానులు సమక్షంలో గ్రాండ్ గా ఈ ఫంక్షన్ చేయటానికి నిర్మాత గణేష్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఆ పరిస్దితి లేదని సమాచారం. పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీ లేకపోవటంతో ఆ పంక్షన్ ఇంక లేనట్లే అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్..పూరి తో చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు బిజీలో ఉన్నారు.
ఇక నిర్మాత గణేష్ బాబు ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ ని ఘనంగా చేద్దామని క్రిందటి నెలలో ప్లాన్ చేసారు. కానీ పవన్ ..వంద రోజులు పంక్షన్ చేసుకోమని సూచించటంతో వాయిదా వేసుకుని ఈసారి అభిమానులుకు ఆనందం కలిగించేలా ఓ రేంజిలో భారీ ఎత్తున చేయనున్నారని అన్నారు. అయితే ఇప్పుడు పవన్ ..గణేష్ ని పిలిచి పరిస్ధితి వివరించినట్లు తెలుస్తోంది. మరో ప్రక్క కెమెరామెన్ గంగతో రాంబాబు ఆడియో పండుగ స్టేజీపైనే ఈ వందరోజుల పండగ జరిగే అవకాసముందని వార్తలు వినపడుతున్నాయి.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గబ్బర్ సింగ్' చిత్రం విజయవంతంగా 75 డేస్ పూర్తి చేసుకుని 100 రోజుల దిశగా దూసుకెలుతోంది. నేటికి సినిమా విడుదలై 79వ రోజు. ఇప్పటికే ఈచిత్రం కలెక్షన్ల పరంగా తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి నెం.1 గ్రాసర్‍గా నిలిచింది. అదే విధంగా 306 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.75 డేస్ సెంటర్స్ విషయానికొస్తే...మొత్తం 87 సెంటర్లలో ఈచిత్రం ప్రదర్శింపబడినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.


Click it and Unblock the Notifications











