'గబ్బర్ సింగ్ 2' కొత్త విశేషాలు

ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని ఈ చిత్రంలోకి తీసుకురావటానికి ఈరోస్ వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
సంపత్ నంది మాట్లాడుతూ... ''గబ్బర్ సింగ్ సీక్వెల్ అంటే ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో తెలుసు. అవన్నీ మేళవించి ఈ కథను తయారు చేశాం. స్క్రిప్టు పక్కాగా పూర్తయింది. హీరోయిన్, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని సంపత్‌నంది చెబుతున్నారు. ఇక ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
'రచ్చ'తో ఆకట్టుకున్న సంపత్.. ఆ తరవాత చేస్తున్న చిత్రమిదే. శరత్ మరార్ నిర్మాత. గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తొలిసారి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది.


Click it and Unblock the Notifications











