'గబ్బర్ సింగ్ 2' రైటర్: దర్శకుడుగా ప్రమోషన్
హైదరాబాద్ : త్రివిక్రమ్ ,కొరటాల శివ, కోన వెంకట్, గోపి మోహన్, బాబి(బలుపు రచయిత) ఇలా వరస పెట్టి అందరూ దర్శకులు అవుతున్నారు. ఇదే కోవలో మరో తెలుగు రచయిత దర్శకుడుగా మారుతున్నారు. పవన్ కళ్యాణ్ ..గబ్బర్ సింగ్ 2 కి రచయితగా చేస్తున్న శ్రీధర్ సీపన కూడా మెగా ఫోన్ పట్టుకోవాలని ఫిక్సయ్యారు. శ్రీధర్ సీపన..గతంలో పూలరంగడు, నిప్పు చిత్రాలుకు చేసారు. ప్రస్తుతం రవితేజ పవర్, గోపిచంద్ లౌక్యం చిత్రాలకు పనిచేస్తున్నారు. అయితే హీరోగా...అంతగా మార్కెట్ లేని గౌతమ్ ని ఎంచుకున్నారు.
వివరాల్లోకి వెళితే... బ్రహ్మానందం కొడుకు గౌతమ్ తో సినిమా చేయటానికి మరో దర్శకుడు, నిర్మాత దొరికారు. కెరీర్ ప్రారంభం నుంచి ఒక్క హిట్టూ లేకుండా గెంటుకొస్తున్న గౌతమ్..రీసెంట్ గా బసంతి అనే ఫ్లాఫ్ చిత్రం చేసారు. ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 రచయిత శ్రీధర్ సీపన దర్శకుడుగా మారుతూ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని రారా కృష్ణయ్య నిర్మాత వంశీ కృష్ణ...నిర్మించనున్నారు. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయిని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్టు పూర్తైందని, ఎంటర్టైన్మెంట్ బేస్ కధాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని శ్రీధర్ సీపన నిర్ణయించుకున్నాడని అంటున్నారు. గౌతమ్ సైతం ఈ ప్రాజెక్టు పై నమ్మకంతో ఉత్సాహంగా ఉన్నాడు. కొద్ది పాటి యాక్షన్..ఎక్కువ కామెడీతో చిత్రం నింపుతున్నారని, బ్రహ్మానందం సైతం చిత్రంలో కీలకమైన పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











