'గబ్బర్‌సింగ్'50 డేస్ ఫంక్షన్ ఎప్పుడు..ఎక్కడ
అభిమానలంతా ఎంతగనో ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ భారీ ఎత్తున రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రిలీజైన ఇన్ని రోజులుకు కూడా ప్రతీ ధియోటర్ వద్ద పండుగ లాంటి వాతావరణం నెలకొని ఉండటమే ఈ చిత్రం ఏ రేంజి హిట్టో అనేది తేల్చుకోమంటున్నారు. ఇక ఈ చిత్రం యాభై రోజులుకు దగ్గర కావటంతో ఆ పంక్షన్ ని ఘనంగా చేయాలని నిర్మాత గణేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
'గబ్బర్‌సింగ్'50 డేస్ పంక్షన్ ని జూన్ 29న జరపనున్నట్లు సమాచారం. వైజాగ్ లో ఈ పంక్షన్ చేసే అవకాశముందని చెప్తున్నారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ ధియోటర్ అయిన వి మ్యాక్స్ మల్టిప్లెక్స్ లో ఈ ఫంక్షన్ చేస్తారు. అయితే ఇంకా పవన్ కళ్యాణ్ ఈ పంక్షన్ కి వచ్చేది లేనిది తేలలేదు. ఈ మేరకు నిర్మాత భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం అభిమానలకు విందు భోజనంలా మెప్పిస్తోంది. పవన్ చెప్పే పంచ్ డైలాగులకు ధియోటర్ లో కంటిన్యూ విజిల్స్ పడుతున్నాయి. ఫ్యాన్ కి పండుగ అనిపించిన ఈ చిత్రం కలెక్షన్స్ అఫీషియల్ గా ప్రకటించకపోయినా సునామీ తరహాలో రప్పిస్తోందని నేషనల్ మీడియా సైతం మెచ్చుకుంటూ కథనాలు ప్రసారం చేస్తోంది.
'గబ్బర్‌సింగ్' అవుట్ అండ్ అవుట్ పవన్ చిత్రం. పవన్ అవుట్ స్టాండిగ్ గా తన పాత్రలో జీవించాడు. కామెడీ,పంచ్ డైలాగులు,తనదైన శైలిలో స్టెప్స్ వేసి అలరిస్తున్నాడు. యాక్షన్ సీన్స్ లో అయితే విశ్వరూపం చూపించాడు. అమాయికమైన పల్లె అమ్మాయి గా శృతిహాసన్ ..ఉన్నవి కొద్ది సీన్స్ అయినా అదరకొట్టింది. కానిస్టేబులు సాంబగా అలీ,పవన్ మధ్య సీన్స్ నవ్విస్తే,బ్రహ్మానందం రికవరి రంజిత్ కుమార్ గా కెవ్వు కేక అనిపించాడు. ఇలా పూర్తిగా పవన్ బ్రాండ్ తో వచ్చిన గుడుంబా...గబ్బర్ సింగ్ మత్తులో ఆంధ్రా తూగుతోంది.


Click it and Unblock the Notifications











