మొబైల్ లో 'గబ్బర్ సింగ్' ఆడియో ఫంక్షన్
గబ్బర్ సింగ్ ఆడియో పంక్షన్ ని ఎక్కువ మంది అభిమానులు చూసే విధంగా నిర్మాతలు విన్నూతనంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పూరి వెబ్ సైట్ ద్వారా,టీవీ ఛానెల్స్ లైవ్ ద్వారా,ప్రత్యక్ష్యంగా గానూ చూడటానికి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెబైల్స్ లో కూడా ఈ పంక్షన్ ని తిలకించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన అప్లికేషన్ ని ఒకటి క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అప్లికేషన్ ని డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ లో పెట్టుకుంటే తమ తమ హ్యాండ్ సెట్ లలో ఈ పంక్షన్ ని ఎక్కడనుంచైనా చూసే అవకాశం కలగచేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతన్నట్లు సమాచారం.
ఇక గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. పవర్ స్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం హిందీ సూపర్ హిట్ మూవీ 'దబాంగ్' రీమేక్. చిత్రాన్ని మే 9 న విడుదల చేసేందుకు నిర్మాత గణేష్ బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' అనే చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











