'గబ్బర్ సింగ్' ఆడియో రిలీజ్ వెన్యూ అక్కడా?
రెండు రోజుల క్రితం రచ్చ ఆడియో ఘనంగా జరగటంతో ఇప్పుడు అందరి దృష్టీ రాబోయే చిత్రాల ఆడియో పంక్షన్ లపై పడింది. ముఖ్యంగా పవన్ ప్రతిష్టాత్మకంగా రెడీ చేస్తున్న గబ్బర్ సింగ్ ఆడియోపై అంతటా క్రేజ్ ఉంది. ఒక్క ప్రోమో తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆడియో ని ఏప్రియల్ 14న విడుదల చేయటానికి నిర్ణయించారు. అలాగే ఆ ఆడియోని తిరుపతి పిఆర్పీ గ్రౌండ్స్ లో గ్రాండ్ చేస్తే బావుంటుందని యోచిస్తున్నారు. అయితే ఆడియో వెన్యూపై రకరకాల ఆప్షన్స్ తర్జనబర్జనలు జరుగుతున్నాయి. అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది.
ఇక ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నారు. ఇక ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంభందించిన క్లైమాక్స్ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ లు నేతృత్వంలో భారీగా ఈ క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ఓ ఛేజ్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. క్లైమాక్స్ షూట్ పూర్తైపోతే..ఇక పాటలు బ్యాలెన్స్ ఉండనున్నాయి. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం దబాంగ్ చిత్రానికి రీమేక్. పవన్ ఈ చిత్రంలో తిక్క ఉన్న పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. మిరపకాయతో విజయం సాధించిన హరీష్ శంకర్ దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











