అన్నపూర్ణ స్టూడియోలో 'కెవ్వు కేక'
కెవ్వు కేక...అనగానే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది 'గబ్బర్ సింగ్'గా పవర్ స్టార్ పెట్టించే కేక అని! ఇటీవల గబ్బర్ సింగ్ ఆడియో విడుదలైన తర్వాత ఎవరి నోట చూసినా ఇదే పాట, ఇదే కేక. ఆడియోనే ఇలా ఉందంటే...ఇక వీడియో చూస్తే ఏ రేంజ్‌లో ఉంటుందోనని అభిమానులు ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నారు.
అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసి పోకుండా ఈ ఐటం సాంగు ఉంటుందని, అందుకే ఈ పాట కోసం 'మున్నీ బదనాం హుయే' ఫేం మలైకా అరోరాను ఎంపిక చేసినట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అందాలు ఆరబోయడానికి, అంగాంగ ప్రదర్శన చేయడానికి ఏమాత్రం సిగ్గుపడని మలైకా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రాత్రైనా పగలైనా నాకు ఒకే అంటూ గతంలో ఈ భామ కేక పుట్టించింది.
ప్రస్తుతం గబ్బర్ సింగ్ 'కెవ్వు కేక' పాట చిత్రీకరణ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. మున్నీ బదనాం హుయే పాటకు ఏ మాత్రం తగ్గకుండా పాటను చిత్రీకరిస్తున్నారు. మాస్ మెచ్చే మసాలా బాగా దట్టించి ఈ పాటను ఓ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో నర్తించేందుకు మలైకా అరోరాకు రూ. కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాశీభట్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











