'గబ్బర్‌సింగ్'క్లైమాక్స్ లీకెడ్ డైలాగులు
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ క్లైమాక్స్ లో వచ్చే డైలాగులు,సీన్ చాలా ఎమోషనల్ గా కట్టిపడేస్తాయని చెప్తున్నారు. సల్మాన్ ఖాన్ దబాంగ్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం పవన్ బాడీ లాంగ్వేజి కి తగినట్లుగా చాలా మార్చారు. ముఖ్యంగా ఇక్కడ నేటివిటీకి తగినట్లుగా సెంటిమెంట్ ని బాగా పండించినట్లు చెప్పుకుంటున్నారు. అలాగే హరీష్ శంకర్ రాసిన పంచ్ డైలాగులు సైతం సినిమాకు ప్రాణంగా నిలుస్తాయి అంటున్నారు.
ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే..లీకైందంటూ నెట్ లో హల్ చల్ చేస్తున్న సీన్ ప్రకారం...పవన్ కళ్యాణ్ తల్లిని కొందరు మర్డర్ చేస్తారు. అయితే ఆమెను ఎవరు చంపారో తెలియదు. దాంతో అతను చాలా బాధగా,కోపంగా ఉంటాడు. అదే విషయాన్ని తన స్నేహితుడుతో చెప్తూంటాడు. అదే సమయంలో విలన్స్ ..పవన్ మీద ఎటాక్ చేస్తారు. అప్పుడు వారితో ఫైట్ చేస్తూనే తన ప్రెండ్ తో మాట్లాడటం కంటిన్యూ చేస్తూంటాడు. అందులో ఒకడు పవన్ ని కత్తితో చంపేయాటికి ట్రై చేస్తాడు. పవన్ అప్పుడు వాడి చేతిలోనుంచి కత్తిని తీసుకుని...వాడినే చంపేస్తాడు. అది చూసి అతని స్నేహితుడు స్టన్ అవుతాడు.
అప్పుడు పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గా...నన్ను చంపడానికి వచ్చిన వాడ్ని నేను చంపడం తప్పా...అంటాడు. పవన్ కళ్యాణ్ తనదైన మాడ్యులేషన్ లో ఎమోషన్స్ పండిస్తూ చెప్పే ఆ డైలాగు ప్రేక్షకుడికి సినిమా చూసిన చాలా సేపు అలా ఉండిపోతుంది అంటున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ సీన్ కి బాగా కనెక్టు అయ్యేలా హరీష్ శంకర్ చిత్రీకరించాడని వినికిడి.
ఇక ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ ఆడియో విషయాన్ని నిర్మాత గణేశ్ వెల్లడిస్తూ 'మా సినిమా మీద అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాటికి తగ్గట్లుగా చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. పవన్‌కళ్యాణ్‌గారి కెరీర్‌లోనే నెంబర్‌వన్ హిట్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. ఇటువంటి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా హీరోగారికి కృతజ్ఞతలు. దర్శకుడు హరీశ్‌శంకర్ సినిమాని బాగా తీశారు. ఈ నెల 15న ఆడియోని, మేలో సినిమాని విడుదల చేస్తాం' అన్నారు.
శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.


Click it and Unblock the Notifications











