ప్రేమికుల రోజు..పవన్ అభిమాలకు పండగ రోజు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'గబ్బర్ సింగ్'. పవన్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం 'గబ్బర్ సింగ్' చిత్ర ట్రైలర్ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అరోజు పలు కొత్త చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో అదే రోజు ఈ ట్రైలర్లను థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
హిందీ సూపర్ హిట్ మూవీ 'దబాంగ్' రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో...పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో శృతిహాసన్ నటిస్తోంది. సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
పంజా సినిమా అనుకున్న అంచనాలను అందుకోక పోవడంతో ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ తో పాటు, ఇటు అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. పంజాలా సీరియస్ సబ్జెక్టు కాకుండా 'గబ్బర్ సింగ్' కమర్షియల్ అంశాలతో కూడిన ఎంటర్‌టైన్మెంట్ సినిమా కావడంతో సినిమా విజయంపై ఇటు ప్రేక్షకుల్లోనూ నమ్మకం ఏర్పడింది.


Click it and Unblock the Notifications











