twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గబ్బర్‌సింగ్ సీక్వెల్....హరీష్ ఔట్, శ్రీను వైట్ల ఇన్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పవన్‌తో 3 సినిమాలకు కాంట్రాక్టు కుదుర్చుకున్న బండ్ల గణేష్ ఇప్పటికే తీన్‌మార్, గబ్బర్ సింగ్ చిత్రాలు నిర్మించారు.

    మూడో సినిమా 'గబ్బర్ సింగ్' సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్న గణేష్ ఇప్పటికే ఈ సినిమా కోసం 2 టైటిల్స్ రిజిస్టర్ చేయించారు. 'గబ్బర్ సింగ్-2, గబ్బర్ సింగ్ ఇన్ హైదరాబాద్' టైటిల్స్ లో ఏదో ఒకటి ఈ చిత్రానికి ఖరారు చేయనున్నారు. తాజాగా వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం.....గబ్బర్ సింగ్ సీక్వెల్‌కు హరీష్ శంకర్ దర్శకుడు కాదని, దీన్ని ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో చేయించాలనే ఆలోచనలో బండ్ల గణేష్ ఉన్నారని సమాచారం.

    గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించడంతో హరీష్ శంకర్ దశ తిరుగుతుందని అనుకున్నారంతా. కానీ ఆ సినిమా క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్ కొట్టేసాడు. కేవలం పవన్ వల్లనే సినిమా ఆ రేంజిలో ఆడిందని, వేరొకరితో తీసి ఉంటే ఆ రేంజి హిట్ అయ్యేది కాదనే టాక్ వచ్చింది. ప్రస్తుతం హరీష్ శంకర్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. జూనియర్ ఎన్టీఆర్ తో 'ఎంఎల్ఏ' సినిమా ఇంకా చర్చల దశలోనే ఉంది. ఇప్పటి వరకు ఖరారు కాలేదు.

    ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే....ఆయన నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకుంది. నెక్ట్స్ పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రూపొందబోతోంది. నవంబర్లో ఈచిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

    English summary
    Producer Bandla Ganesh is already looking out for suitable titles for Gabbar Singh sequel. Apparently the filmmakers have zeroed in on two titles for the film - Gabbar Singh 2 and Gabbar Singh in Hyderabad. Latest Buzz is that the film is scheduled to hit the floors sometime next year and Harish Shankar has been replaced by crazy director Srinu Vitla.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X