»   » పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'అనఫీషియల్ ప్రొడ్యూసర్ ఆయనే

పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'అనఫీషియల్ ప్రొడ్యూసర్ ఆయనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ఆరెంజ్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుని నాగబాబుని డిప్రెషన్ లోకి తోసిన సంగతి తెలిసిందే.అయితే ఆ నష్టానుంచి కోలుకోవటానికి రామ్ చరణ్,పవన్ కళ్యాణ్ నడుం బిగించారని సమాచారం.చిరంజీవి సోదరుల మద్య తగాదాలు వచ్చినట్లు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కధనాలపై ఈ విషయాలు బయిటకు వచ్చాయి.చిరు కుటుంబానికి బాగా సన్నిహితుడైన ఓ వ్యక్తి కథన ప్రకారం...నాగబాబు ఆరంజ్ సినిమా తీసి బాగా నష్ట పోయిన మాట వాస్తవమే.అయితే ఆప్పుడు రామ్ చరణ్ తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చివేశారని,అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ మరో ఐదు కోట్ల సాయం అందించడమే కాకుండా, వేరే పేరుతో గబ్బర్ సింగ్ అనే సినిమా తీయడానికి సహకరిస్తున్నారని తెలిపారు.ఇక ఈ ఆ ఆంగ్ల పత్రిక ఆఫీసుకు చిరంజీవి ఫోన్ చేసి మండిపడ్డాడని కూడా తెలుస్తోంది.

English summary
Pawan Kalyan who was last seen as police officer in Puli, is all set to portray the same role in his next film tilted Gabbar Singh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu