ఆమె బికినీ వేసుకుందిట!

అప్పుడెప్పుడో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా పరిచయమైన గజాలా ఆ తర్వాత వరసగా కొన్ని సినిమాలు చేసినా వర్కవుట్ కాలేదు. కెరీర్ లో గ్యాప్ రావటం,పర్శనల్ గా కొన్ని ప్లాబ్లమ్స్ రావటంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. అయితే మళ్ళీ ఆమె భద్రాధ్రి (శ్రీహరి,రాజా హీరోలు)సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది. కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడగపోవటంతో ఆమెను గుర్తుచేసుకున్న వారు లేకుండా పోయారు.
దాంతో ఆమె తిరిగి డిప్రెష్ అయి పోయే సమయంలో నటుడు,దర్శకుడు అయిన అర్జున్ సినిమాలో ఆఫర్ వచ్చింది. తమిళంలో నిర్మితమవుతున్న ఆ సినిమా పేరు దొరై .ఆ సినిమాలో ఆమె ఒక సన్నివేశంలో బికినీ ధరించాల్సి వచ్చిందిట. కానీ చెయ్యాలా వద్దా అని సంశయిస్తున్న గజాలా ని అర్జున్ తప్పేమీ కాదని,ఇది గ్లామర్ కి సంభందించిన విషయమని తిరిగి ఈ సన్నినేసమే కెరీర్ మొదలవటానికి దారితీయవచ్చునని నచ్చ చెప్పి ఒప్పించాడుట. ఈ విషయాన్ని ఆమే మీడియాతో కావాలని చెప్పింది.
అంటే ఈ సినిమాలో నేను బికినీతో నటించాను అని ఇన్ డైరక్ట్ గా సినిమా చూడండని హింట్ ఇస్తోంది.అయితే అంతా బాగానే ఉంది గానీ ఎవరిని పడితే వారిని బికినీలో చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడతారా అన్నది గజాలా తేల్చుకోవాల్సిన ప్రశ్న.


Click it and Unblock the Notifications











