గణేష్ తో పూరీ చేసే చిత్రంలో హీరో అతనే
పూరీ జగన్నాధ్, గణేష్ బాబు కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందంటూ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎవరు హీరో అన్నది మాత్రం వారు తెలియపరచలేదు. కానీ పరిశ్రమలో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ చరణ్ ని హీరోగా ఎంపిక చేసినట్లు సమాచారం. పూరీ జగన్నాధ్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన చిరుత మంచి హిట్టు అయిన సంగతిని దృష్టిలో పెట్టుకుని ఈ కాంబినేషన్ ని సెట్ చేసినట్లు చెప్తున్నారు. ఇక వచ్చే యేడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం ఉంటుంది.
ప్రస్తుతం పూరి మహేష్‌బాబుతో 'ది బిజినెస్ మేన్' చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇదే చిత్రాన్ని అభిషేక్ బచ్చన్‌తో హిందీలో రీమేక్ చేస్తారు. ఆ తర్వాత రవితేజతో 'ఇడియట్ 2' చేస్తారు. వీటి అనంతరం గణేష్ బాబు చిత్రం ఉంటుంది. ఇక గణేష్ బాబు తీన్ మార్ చిత్రం అనంతరం పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చిత్రం ప్లాన్ చేసారు. బాలీవుడ్ హిట్ దబాంగ్ రీమేక్ గా హరీష్ శంకర్ దర్సకత్వంలో ఆ చిత్రం ప్రారంభం కానుంది. ఈ లోగా రామ్ చరణ్ కూడా తను చేస్తున్న రచ్చ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రెడీ అవుతారు.


Click it and Unblock the Notifications











