పవన్ కళ్యాణ్ సలహాతో గణేష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్...
పవన్ కళ్యాణ్ తో 'తీన్ మార్" సినిమా నిర్మించిన గణేష్, తన తదుపరి చిత్రంగా చరణ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఓ ప్రముఖ దర్శకుడి డేట్స్ తన వద్దే పెట్టుకున్న గణేష్, ఆ దర్శకుడితో చరణ్ హీరోగా సినిమాకి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నాడట. ఆ దర్శకుడెవరనేది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా, చరణ్ తో సినిమా తెరకెక్కించబోయే ఆ దర్శకుడు మాస్ మసాలా సినిమాల స్పెషలిస్ట్ అన్నది ఇన్ సైడ్ సోర్సెస్ కథనం.
'మెరుపు" సినిమా ప్రారంభమైనా, ఆ సినిమా అటకెక్కేయడంతో కన్ ఫ్యూజన్ లో పడ్డ చరణ్ కి, బాబాయ్ పవన్ ఇచ్చిన సలహా వర్కవుట్ కావడంతో, ఆ సలహా ప్రకారమే గణేష్ నిర్మాతగా సినిమాకి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. కాగా రామ్ చరణ్ ఇంకా మైమిలో ట్రైనింగ్ తీసుకొంటున్నాడు. మరొ కొద్ది రోజుల్లో హైదరాబాదు రానున్నారు. వచ్చిన వెంటన జూన్ నెలలో వివి వినాయక్ దర్శకత్వంలో 'రచ్చ" మూవీ సెట్స్ మీదకి వెళ్ళనుంది. అయితే వివి వినాయక్ సినిమాకి ఇంతవరకూ ప్రొడ్ర్యూసర్ ఎవరనేది తెలియలేదు. కాగా ఆలిస్ట్ లో తీన్ మార్ ప్రొడ్యుసర్ గణేష్ బాబు ఓకే చేస్తే మరో మెగా మూవీ లక్కీగా గణేష్ అకౌంట్ లో చోటుసంపాదించుకొంటుంది.


Click it and Unblock the Notifications











