పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' ఆగలేదు కానీ నిర్మాత మారాడు
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందనున్న గబ్బర్ సింగ్ చిత్రం ఆగిపోయినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొద్ది రోజులుగా వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆగిపోలేదని పవన్ నిర్మాతగా చేద్దామనుకున్న ఈ చిత్నాన్ని గణేష్ కి అప్పచెప్పాడని విశ్వసనీయ సమాచారం. తీన్ మార్ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా నిర్మాణ పరంగా గణేష్ అద్బుతంగా చేసాడని పవన్ నమ్మటం వల్లే ఈ ప్రాజెక్టుని గణేష్ కి అప్పచెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ప్రారంభం కానున్న ఈచిత్రంలో హీరోయిన్ ఎంపిక ఇక మిగిలి ఉంది. ఇక హిందీ చిత్రం దబాంగ్ రీమేక్ గా రూపొందే ఈ చిత్రం స్క్రిప్టుని గత కొద్ది రోజులుగా హరీష్ శంకర్ రూపొందిస్తున్నారు.
ఈ మధ్యన ఓ రెండు డైలాగులను హరీష్ శంకర్ ట్విట్టర్ లో పెట్టారు.మిరపకాయతో విజయం సాధించిన హరీష్ శంకర్ ఈ చిత్రంలో పంచ్ డైలాగ్ లుతో ఆకట్టుకుంటారని నమ్మి పవన్ ఈ ప్రాజెక్టు అప్పచెప్పారు. అయితే పవన్ దీనిని పక్కన పెట్టి షాడో చిత్రం షూటింగ్ కి సై అనటంతో ఈ రకమైన అనుమానాలు అందరిలో రేగుతున్నాయి. మరో ప్రక్క హరీష్ శంకర్, హరీష్ శంకర్ తో కలిసి సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే చిత్రం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మరో ప్రక్క హిందీ చిత్రం లవ్ ఆజ్ కల్ రీమేక్ గా వచ్చిన తీన్ మార్ చిత్రం కూడా భాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవటంతో పవన్ ఆలోచనలో పడి ఈ ప్రాజెక్టుని పెండింగ్ లో పెట్టాడని మరికొంతమంది అంటున్నారు. అయితే ఇవేమీ నిజం కావని త్వరలోనే ఈచిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











