పవర్ స్టార్‌కి పనోడిలా మారిన నిర్మాత!

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వరుస సినిమాలు చేస్తున్న నిర్మాత బండ్ల గణేష్ వ్యవహార శైలిపై సినీ పరిశ్రమలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యవహార శైలి చీప్‌గా ఉందని, తనో నిర్మాత అనే విషయం మరిచిపోయి విలువలకు దిగజారి పవన్ కళ్యాణ్‌కి రాయల్ సర్వెంట్‌లా మారాడని, స్టార్ దర్శకుల విషయంలోనూ ఇలానే వ్యవహరిస్తున్నాడని, ఇలాంటి వాళ్ల వల్ల నిర్మాతలకు విలువ లేకుండా పోతోందని, పెద్ద హీరోలతో, దర్శకులతో సినిమాలు చేయడం కోసం మరీ ఇంత దిగజారుడు తనమా? అంటూ కొందరు నిర్మాతలు చిటపటలాడుతున్నారట.

ఇప్పుడు ఈ విషయం జాతీయ మీడియాలో సైతం చర్చనీయాంశం కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇటీవల ఎయిర్ పోర్టులో గణేష్ పవన్ కళ్యాణ్ బ్యాగ్ మోస్తూ పనోడిలా వ్యవహరించిన విషయంపై ఓ ఆంగ్ల జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. ఇంతకాలం ఈవిషయాన్ని పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు సదరు ఇంగ్లీష్ పత్రికలలో వచ్చిన కథనం నేపథ్యంలో ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కళ్యాణ్ - బండ్ల గణేష్ కాంబినేషన్లో 'తీన్ మార్'చిత్రం రూపొందింది. ప్రస్తుతం మళ్లీ వీరి కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రంలో పవర్ స్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హిందీలో సూపర్ హిట్టయిన 'దబాంగ్'చిత్రానికి ఇది రీమేక్.

ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: కడలి బ్రహ్మ, ఎడిటింగ్ గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగ్నేష్ సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X