మహేష్ బాబు వారసుడి టాలీవుడ్ ఎంట్రీ.. ఆ ప్రొడ్యూసర్ల మధ్య పోటీ!
Gautham Ghattamaneni: టాలీవుడ్ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగుతోంది. ప్రతి రోజూ కొత్త హీరోలు, హీరోయిన్లు వెండితెరకు పరిచయమవుతుండగా, స్టార్ హీరోల వారసుల ఎంట్రీలు మాత్రం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాంటి ఎంట్రీలతో కొత్త తరానికి కొత్త ఫ్యాన్‌బేస్‌లు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారసుల్లో గౌతమ్ ఘట్టమనేని (Gautham Ghattamaneni) ఒకడిగా నిలుస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ (Krishna) మనవడిగా.. మహేష్ బాబు (Mahesh Babu) వారసుడిగా ఎప్పుడెప్పుడు గౌతమ్ ఎంట్రీ ఇస్తాడా ?అని ప్రిన్స్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
గౌతమ్ ఘట్టమనేని.. ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే బాలనటుడిగా 1- నేనొక్కడినే సినిమాలో నటించి, మంచి మార్కులు కొట్టిన గౌతమ్. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ అమెరికాలోని ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ లో శిక్షణ పొందుతున్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టాడానికి, కేవలం స్టార్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే కాకుండా, యాక్టింగ్‌లో పూర్తి మెరుగులు దిద్దుకుని రావాలన్నదే మహేష్ బాబు ఆలోచనగా తెలుస్తోంది.ట్రైనింగ్ పూర్తయ్యాకే గౌతమ్ డెబ్యూ సినిమాపై అధికారిక ప్రకటన ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే.. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గౌతమ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసే నిర్మాత ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ రేసులో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు సీనియర్ నిర్మాత అశ్వినీ దత్, మరొకరు మహేష్ బాబుకు అత్యంత సన్నిహితుడైన అనిల్ సుంకర. ఇక సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్‌కు స్టార్ కిడ్స్‌ను లాంచ్ చేసిన స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబును రాజకుమారుడుతో, రామ్ చరణ్‌ను చిరుతతో, అల్లు అర్జున్‌ను గంగోత్రితో పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ గౌతమ్‌ను కూడా ఆయనే లాంచ్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే.. మరోవైపు అనిల్ సుంకర కూడా ఈ ప్రాజెక్ట్‌పై తీవ్ర ఆసక్తి చూపుతున్నారని సమాచారం. మహేష్ బాబుతో ఆయనకు ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దూకుడు, ఆగడు, 1: నేనొక్కడినే వంటి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చాయి. ముఖ్యంగా 1 - నేనొక్కడినే సినిమాలో గౌతమ్ .. జూనియర్ మహేష్ గా నటించడం కూడా ఈ బంధాన్ని మరింత బలపరిచింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనిల్ సుంకర మాట్లాడుతూ, 'గౌతమ్‌ను లాంచ్ చేసే అవకాశం వస్తే తప్పకుండా ప్రయత్నిస్తాను. కానీ, ఫైనల్‌గా మంచి స్క్రిప్ట్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి' అని చెప్పడం గమనార్హం.
ఇక నిర్మాతలకంటే కూడా పెద్ద ప్రశ్న... గౌతమ్‌ను పరిచయం చేసే దర్శకుడు ఎవరు అన్నదే. మహేష్ బాబు స్టార్‌డమ్, కృష్ణ లెగసీ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని, గౌతమ్ వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ, స్క్రీన్‌ప్లే అవసరం. అందుకే ఈ డెబ్యూ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని సమాచారం.
ఇలా గౌతమ్ ఘట్టమనేని హీరో ఎంట్రీకి ఇంకా అధికారిక డేట్ రాకపోయినా, ఆయనను లాంచ్ చేయాలనే పోటీ మాత్రం ఇప్పటికే టాలీవుడ్‌లో హీట్ పెంచుతోంది. అశ్వినీ దత్ సెంటిమెంట్ గెలుస్తుందా? లేక అనిల్ సుంకర సాన్నిహిత్యం పని చేస్తుందా? లేదా మరో పెద్ద నిర్మాత రంగంలోకి దిగుతాడా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏదిఏమైనా
ఒక విషయం మాత్రం ఖాయం.. గౌతమ్ డెబ్యూ టాలీవుడ్‌లో భారీ ఈవెంట్‌గా మారనుంది.


Click it and Unblock the Notifications











