NBK109: బాలయ్య సినిమాలో స్టార్ డైరెక్టర్.. ఎలాంటి పాత్ర చేస్తున్నాడో తెలిస్తే!

టాలీవుడ్‌లో ఉన్న యంగ్ స్టార్ హీరోల కంటే సీనియర్లు వేగంగా ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతోన్నారు. మరీ ముఖ్యంగా ఒక బడా హీరో మాత్రం వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఆయనే.. నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్యనే ఆయన 'అఖండ', 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్‌ హిట్లను కొట్టారు.

ఫుల్ ఫామ్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 109వ చిత్రాన్ని బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇటీవలే వచ్చిన పోస్టర్ల ద్వారా అర్థం అయింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరగ్గా.. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను తీస్తున్నారు.

 Gautham Vasudev Menon Key Role In Balakrishna and Bobby Movie

విభిన్నమైన సబ్జెక్టుకు బాలయ్య మార్కును జోడించి రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ఇప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ శరవేగంగానే జరుగుతోంది.

బాబీ - బాలయ్య కలిసి చేస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రోజులు చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఆ పాత్రను చేస్తున్నట్లు న్యూస్ లీకైంది. ఆ తర్వాత చిత్ర యూనిట్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఇందులో మరో విలన్ కూడా ఉన్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

 Gautham Vasudev Menon Key Role In Balakrishna and Bobby Movie

బాలయ్య సినిమాలో మరో విలన్ పాత్ర కోసం స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌‌ను తీసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఈయన ఇందులో మెయిన్ విలన్‌గా చేయకున్నా.. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లోనే కనిపించబోతున్నారట. ముఖ్యంగా బాలయ్య - గౌతమ్ మీనన్ మధ్యన వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. దీంతో ఈ చిత్రంపై హైప్ పెరుగుతోంది.

ఇదిలా ఉండగా.. పూర్తి స్థాయి డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్దా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X