బాలయ్యను కొట్టేందుకు రెడీ అయిన స్టార్ డైరెక్టర్.. నందమూరి ఫ్యాన్స్‌కు ఈ నిజం తెలిస్తే!

ఆ మధ్య వరుసగా ఫ్లాపులను చూస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నా.. 'అఖండ' సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆ జోష్‌లోనే వరుసగా సినిమాలు చేసిన ఈ సీనియర్ స్టార్ హీరో.. ఆ తర్వాత కూడా 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి'తో హిట్లు కొట్టారు. దీంతో సక్సెస్‌ల హ్యాట్రిక్‌ నమోదు చేశారు. దీంతో ఫుల్ జోష్‌తో దూసుకెళ్తున్నారు.

హిట్లతో దూసుకెళ్తోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 109వ చిత్రాన్ని బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇప్పటికే రివీల్ అయింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిస్తున్నారు.

Gautham Vasudev Menon Role Highlight In Balakrishna and Bobby Movie

మాస్ స్టోరీకి మంచి డ్రామాను జోడించి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఈ మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ఇప్పుడు బాలయ్య బిజీగా ఉండడంతో షూట్ నిలిచింది. ఇలా ఇప్పటి వరకూ 80 శాతం టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు.

బాలయ్య - బాబీ కలిసి చేస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రోజులు ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఆ పాత్రను చేస్తున్నట్లు రివీల్ చేశారు. ఈ క్రమంలోనే ఇందులో మరో విలన్ కూడా ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఆ పాత్రలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ను తీసుకున్నారట.

Gautham Vasudev Menon Role Highlight In Balakrishna and Bobby Movie

బాలయ్య సినిమాలో మరో విలన్ పాత్ర కోసం స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌‌ను తీసుకున్నట్లు సమాచారం లీకైంది. ఈయన ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లోనే కనిపిస్తారట. ముఖ్యంగా బాలయ్యకు గౌతమ్ మీనన్ ట్విస్ట్ ఇస్తూ వెన్నుపోటు పొడిచే సీన్స్ సినీ ప్రియులను షాక్‌కు గురి చేసేలా ఉంటుందని తెలిసింది. ఈ సన్నివేశాలను బాలయ్య ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టం అని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. బాలయ్య మార్క్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఊర్వశీ రౌటేలా, దుల్కర్ సల్మాన్, చాందినీ చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర మాస్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X