ఏమైంది? చిరు 150వ సినిమా నుండి రామ్ చరణ్ ఔట్!

By Bojja Kumar

హైదరాబాద్: ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ జీరోగా మారడంతో రాజకీయంగా పనిలేకుండా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాల వైపు దృష్టిసారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన తన 150వ సినిమా గురించి పనుల్లో తలమునకలైపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులో తన పుట్టినరోజు నాటికి సినిమా మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

చిరంజీవి 150వ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో చిరంజీవి ఓటమి పాలయ్యారనే బాధకంటే....ఆయన మళ్లీ తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారనే ఆనందమే అభిమానుల్లో ఓక్కువగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ హ్యాండిల్ చేస్తారని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని నిర్మించ బోయేది తానే అని గతంలో రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ బాధ్యత నుండి రామ్ చరణ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. వేరొకరి చేతికి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

ఎవరు నిర్మిస్తారు?

ఎవరు నిర్మిస్తారు?

ఈ చిత్రాన్ని చిరంజీవి బావమరిదికి చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట.

రామ్ చరణ్‌కు అనుభవం లేదు

రామ్ చరణ్‌కు అనుభవం లేదు

నిర్మాతగా రామ్ చరణ్‌కు అనుభవం లేదు. ఈ నేపథ్యంలో అతని చేతికి నిర్మాణ బాధ్యతలు అప్పజెబితే అనవసర ఇబ్బందులు తలెత్తుతాయని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం.

వివి వినాయక్

వివి వినాయక్

గతంలో చిరంజీవికి ఠాగూర్ లాంటి అద్భుతమైన సినిమాను అందించిన వివి వినాయక్ అందుకు ఏ మాత్రం తీసిపోకుండా చిరంజీవి 150వ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్ని అంశాలు ఉండేలా...

అన్ని అంశాలు ఉండేలా...

చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మంచి కథాంశం, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని విషయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

చిరంజీవి బర్త్ డే గిఫ్ట్

చిరంజీవి బర్త్ డే గిఫ్ట్

ఈ సారి మెగా అభిమానులకు చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న 150 సినిమా కానకగా అందనుందని మెగాఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X