ఇద్దర్ని లైన్లో పెట్టేందుకు సన్నాహాలు.. వంద కోట్ల దర్శకుడి తంటాలు
గీతగోవిందం లాంటి విజయం సాధించాక ఏ దర్శకుడైనా నేలపై ఆగుతాడా. ఆ చిత్రంలో నటించిన విజయ్, రష్మికల కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంటే.. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన పరుశురామ్ మాత్రం ఇంకా తాత్సరం చేస్తూనే ఉన్నాడు. సినిమా వచ్చి ఇంతకాలం అవుతున్నా మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. అయితే త్వరలోనే ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది.
వంద కోట్ల సినిమా తీసి, ఇన్ని నెలలు గ్యాప్ తీసుకున్న దర్శకుడు ఇన్ని రోజులిలా ఖాళీగా ఉండాలనుకోడు.అయితే అది కావాలని తీసుకున్న బ్రేక్ కాదు. ఇప్పుడు మాత్రం కాస్త స్పీడుగానే సినిమాల్ని పట్టాలెక్కించాన్న ఉద్దేశంతో హీరోలకు లైన్లు చెప్పి, వాళ్లని రెడీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు టాక్. ఈమధ్యే పరశురామ్ ఇద్దరు హీరోలకు కథలు చెప్పడంలో బిజీ అయిపోయాడని సమాచారం.

పొద్దుట ప్రభాస్ దగ్గరకు వెళ్లి కథ చెప్పిన పరశురామ్.. సాయింత్రానికి నాగచైతన్య ముందు ప్రత్యక్షమయ్యాడని వినికిడి. మహేష్ కోసం రాసుకుని కాదన్న కథని.. ప్రభాస్‌కి చెప్పాడని సమాచారం. నాగచైతన్యకి ఎప్పుడో సిద్ధం చేసిన కథనే కాస్త మార్చి వినిపించేశాడని టాక్. పరశురామ్‌తో సినిమా చేయడానికి నాగచైతన్య ఓకే అనేశాడని తెలుస్తోంది. ప్రభాస్ కాస్త అటూ ఇటూ ఆలోచిస్తున్నాడని సమాచారం. చైతూ ఓకే అనేసినా - ప్రాజెక్టు ఇప్పట్లో సెట్లోకి వెళ్తుందో లేదో చెప్పలేం. వెంకీ మామా అయిపోవాలి. ఆ తరవాత శేఖర్ కమ్ముల సినిమా పూర్తవ్వాలి. ఆ తరవాతే.. డేట్లు ఇవ్వగలడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











