మూడుభాషల్లో తెరకెక్కనున్న 'కాఫీబార్'

By Staff

'సంకీర్తన" సినిమాకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "కాఫీబార్". శశాంక్, బియాంకా దేశాయ్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు గీతా క్రిష్ణ 'కోకిల", 'కీచురాళ్ళ" సినిమాలకు దర్శకత్వం వహించి సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి స్థానం సంపాదించుకొన్నారు. "కాఫీబార్" చిత్రం గురించి దర్శక నిర్మాత మాట్లాడుతూ..సందర్భానుసారంగా వచ్చే ఓ పాటను ఇటీవలే రికార్డింగ్ చేశామన్నారు. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

దాదాపు షూటింగ్ కూడా పూర్తయిందని, సమాజాన్ని జాగృతపరిచే విధంగా కాఫీబార్ ఉంటుందని గీతాకృష్ణ వెల్లడించారు. మైండ్ గేమ్ ఆధారంతో రూపోందిన ఈ కథ ప్రతి ఒక్కరిలోనూ ఆలోచనను అలరింపజేసేలా ఉంటుందని, తప్పకుండా యువతను మెప్పిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. సాంకేతికంగా మంచి సినిమా అనే పేరు తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ఒకేసారి మూడు భాషల్లో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాత తెలిపారు. గిరీష్ కర్నాడ్, అతుల్ కులకర్ణి, బేబి శివానీ ప్రధాన పాత్రధారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X