జెనీలియా అభిమానులకు దుర్వార్త
తన బబ్లీ ఆటిట్టూడ్ తో అల్లరి పిల్లగా దక్షిణాదిన అభిమానులను సంపాదించుకుంది జెనీలియా డిజౌజా. అయితే ఇది నిజంగా జెన్నీ అభిమానులకు దుర్వార్తే. ఎందుకంటే ఆమె ఇక పై సౌత్ సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకుందని సమాచారం. బాయ్స్ సినిమా ద్వారా సౌత్ లో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన జెనీలియా అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇక్కడ తన పాపులారిటీ తగ్గకముందే బాలీవుడ్ లో అడగుపెట్టింది. ఇప్పటికే అక్కడ రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా జాన్ అబ్రహంతో కలిసి నటించి ఫోర్స్ సినిమా హిట్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై పూర్తిగా తన దృష్టి బాలీవుడ్ పైనే పెట్టాలని నిర్ణయించుకుందట జెన్నీ.
ప్రస్తుతం జెనీలియా సౌత్ లో తమిళంలో విజయ్ సరసన 'వేలాయుధం". తెలుగులో రాణా సరసన 'నా ఇష్టం" సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత పూర్తిగా సౌత్ కు దూరంగా ఉండాలని డిసైడ్ అయిందట.


Click it and Unblock the Notifications











