twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    10ఏళ్ల తరువాత హాసిని రీ ఎంట్రీ.. ఆ హీరో వల్లే మళ్ళీ తెలుగులో..

    |

    పెళ్లి జరిగితే హీరోయిన్స్ వెండితెరకు దురమవ్వడం చాలా కామన్. కానీ కొందరు మాత్రం పెళ్లికి నటనకు సంబంధం లేదు అని విధంగా గ్లామరస్ హీరోయిన్స్ గా కూడా కొనసాగుతున్నారు. కాజల్ అగర్వాల్, సమంత అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక జెనీలియా తెలుగు తెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమయ్యింది. ఇక పదేళ్ల తరువాత ఒక హీరో కారణంగా ఆమె మళ్ళీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

    సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు

    బొమ్మరిల్లు 'హాసిని' బ్రాండ్..

    బొమ్మరిల్లు 'హాసిని' బ్రాండ్..

    జెనీలియా అంటే దాదాపు తెలుగు ఆడియెన్స్ అందరికి తెలుసు. ఆమె నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే.. బొమ్మరిల్లు మరొక ఎత్తు. అందులో హాసిని అనే పాత్రలో నటించిన జెనీలియా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఎంతగానో కనెక్ట్ అయ్యింది. ఇప్పటికి కూడా ఆమె ఫొటో కనిపిస్తే నెటిజన్లు హాసిని అనే పేరును మెన్షన్ చేస్తుంటారు.

     ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో

    ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో

    తెలుగు జనాలకు హాసినిగా కనెక్ట్ అయిన ఈ బ్యూటీ తెలుగు తెరకు దూరమయ్యి 9 ఏళ్లయ్యింది. ఆరెంజ్ ప్లాప్ అనంతరం ఒక్కసారిగా కెరీర్ డౌన్ అయ్యింది. అనంతరం రానాతో చేసిన నా ఇష్టం అనే సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ తెలుగు సినిమాలు చేయలేదు. కేవలం అప్పుడప్పుడు హిందీ సినిమాల్లో గెస్ట్ రోల్స్ తో మెప్పిస్తూ ఉంది.

    మ్యారేజ్ తరువాత

    మ్యారేజ్ తరువాత

    నా ఇష్టం సినిమా అనంతరం బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ మ్యారేజ్ లైఫ్ తో బిజీ అయిపోయింది. ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన హాసిని వారితోనే లైఫ్ ను హ్యాపీగా కొనసాగిస్తోంది. ఇక మధ్యలో నటిగా ఆఫర్స్ ఎన్నో వచ్చాయి. కానీ భర్త కోసం పిల్లల కోసం ఈ బ్యూటీ వాటిని మొత్తం పక్కన పెట్టేసింది.

    రామ్ తో క్లోజ్ గా..

    రామ్ తో క్లోజ్ గా..

    ఇక చాలా కాలం తరువాత జెనీలియా ఒక తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రామ్ పోతినేని చేస్తున్న ఒక సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రామ్ తో రెడీ అనే సినిమాలో నటించిన జెనీలియా అప్పటి నుంచి అతనికి క్లోజ్ ఫ్రెండ్ అయ్యింది. ఎలాంటి ఫంక్షన్ జరిగినా కూడా ఇద్దరు ఒకరి నుంచి మరొకరికి ఇన్విటేషన్ వెళుతుందట.

    Recommended Video

    'Boys' Movie Launch Event In Hyderabad || Geethanand || Sreehan ||
    ఇంతకు ఏ సినిమాలో..

    ఇంతకు ఏ సినిమాలో..

    ఇక ప్రస్తుతం రామ్ పోతినేని లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తరువాత సినిమాను బుచ్చిబాబు, మారుతి వంటి టాలెంటెడ్ దర్శకులతో చేయాలని అనుకుంటున్నాడు. మరి జెనీలియాను ఏ సినిమా కోసం అడిగారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

    English summary
    Hindi audiences are keenly watching any film related to Ram Pothineni. Recently Ismart Shankar has dubbed in Hindi and received good results on Satellite and YouTube too. The film has received over 100 million views on YouTube. Ram has set a new record with Puri Jagannath Direction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X