8ఏళ్ళ తరువాత జెనీలియా రీ ఎంట్రీ.. మెగాస్టార్ సినిమాలో నెగిటివ్ రోల్?
జెనీలియా అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా ప్రతి ఒక్కరిని ఎట్రాక్ట్ చేసిన ఈ ఆరెంజ్ పిల్ల అప్పట్లో చా అల్లరిగా కనిపించేది. కొన్నేళ్ల వరకు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దాదాపు ఎండ్ కార్డ్ పెట్టేసింది. ఇక 8 ఏళ్ల తరువాత తెలుగు తెరపై కనిపించడానికి అమ్మడు సిద్ధమైందనే టాక్ వస్తోంది.

సత్యం సినిమాతో ఎంట్రీ..
టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్స్ కొరత ఉన్న సమయంలో జెనీలియా సత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ యాక్టింగ్ కి మంచి క్రేజ్ రావడంతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్, విష్ణు వంటి హీరోలతో యాక్ట్ చేసి కేవలం తనకు నచ్చిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది.

టాలీవుడ్ హాసిని..
జెనీలియా ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లోనే నటించింది. మెయిన్ గా బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ సినిమాలో హాసినిగా కనిపించి ప్రతి ఒక్కరిని ఎట్రాక్ట్ చేసింది. రెడీ, డీ వంటి సినిమాలు కూడా జెనీలియాకు ఒక బ్రాండ్ ఇమేజ్ సెట్ చేశాయి.

ఆరెంజ్ దెబ్బ
అయితే ఆరెంజ్ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి చాలా వరకు అవకశాలు తగ్గాయి. చివరగా తేలుగులో రానాతో నా ఇష్టం అనే సినిమా చేసింది. 2012లో వచ్చిన ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో జెనీలియా సినిమాలకు ముగింపు పలికి రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత అప్పుడప్పుడు బాలీవుడ్ లో గెస్ట్ రోల్స్ చేస్తోంది.

8ఏళ్ల తర్వాత..
ఇక 8 ఏళ్ల తరువాత ఈ బ్యూటీ తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లో జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుందట. దర్శకుడు సుజిత్..జెనీలియాను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











