ఇలియానా తర్వాత కోటి శిఖరాన్ని అందుకున్న జెనీలియా!
'వీలైతే నాలుగు మాటలు లేదంటే కప్పు కాఫీ" అని చిలకపలుకులు పలికిన హాసిని నేడు వీలైతే వంద లక్షలు లేదంటే కోటి" అంటూ తెగేసి చెబుతోంది. అటు హిందీ, ఇటు కన్నడ, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నక్రేజి జెనీలియాకు బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం, అంజనా ప్రొడక్షన్లో నాగేంద్రబాబు నిర్మాణం రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆరెంజ్" లో చాక్లెట్ బాయ్ గా రామ్ చరణ్, సరసన ఐదుగురు కథానాయికలలో జెనీలియాకి ఆఫర్ వచ్చింది. హాసిని క్యారెక్టర్ సృష్టించిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అయినా..కోటి ఇస్తేనే నటిస్తాను లేదంటే మీ ఇష్టం అంది. హిందీ, దక్షిణాది భాషల్లో డిమాండ్ ఉన్నా వాటన్నింటిని వదులుకుని ఇందులో నటిస్తున్నానని చెప్పింది. దీంతో కోటి ఇవ్వక తప్పలేదని తెలిసింది. ఇలియానా తర్వాత కోటి శిఖరాన్ని అందుకున్న కథానాయికగా నిలిచింది.
జెనీలియా రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ బొమ్మరిల్లు బాస్కర్ నాగబాబు genelia ram charan teja orange bommarillu bhaskar nagababu


Click it and Unblock the Notifications