మళ్లీ తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి!
సెలబ్రిటీల జీవితం మొత్తం పబ్లిక్ డొమైన్‌నే ఉంటుంది. వారు ఏం మాట్లాడినా.. ఏం చేసినా ఇట్టే..లోకల్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు వైరల్ గా మారుతుంది. ఏ చిన్న విషయమైనా క్షణాల్లో ట్రెండ్ కావడం ఇప్పుడు సాధారణమే. ప్రముఖులు ఏం తింటున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎవరి తో ఉన్నారు అన్నది రోజూ అభిమానులు ఫాలో అవుతూనే ఉంటారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి నటి జెనీలియా విషయంలో కనిపిస్తోంది. ఆమెకు సంబంధించిన ఒక చిన్న విషయమైనా సోషల్ మీడియాలో ఇట్టే వైరలవుతోంది. తాజాగా నటి జెనిలీయాకు సంబంధించి అలాంటి ఓ వార్తే నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తెలుగు ప్రేక్షకులకు బొమ్మరిల్లు అమ్మాయిగా గుర్తుండిపోయే నటి జెనీలియా దేశ్‌ముఖ్. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస విజయాలు అందుకుంది. సత్యం సినిమా ద్వారా తెలుగుప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. సాంబ,సై, హ్యాపీ, బొమ్మరిల్లు వంటి సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అయితే కెరీర్ పీక్‌లో ఉన్న తరుణంలోనే నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ను వివాహం చేసుకున్నారు. అయితే.. సినిమాలకు తాత్కాలిక విరామం ఇచ్చారు. 2012లో వారి వివాహం హిందూ, క్రైస్తవ, మరాఠీ సంప్రదాయాల మేళవింపుతో జరిగింది.

ఇక జెనిలీయా పెళ్లి అనంతరం సినీ కెరీర్ తగ్గించుకుంది. ఈ దంపతులకు రియాన్, రహిల్ అనే ఇద్దరు కుమారులు. వీరితో జెనీలియా ఫ్యామిలీ లైఫ్ ఆనందంగా గడుపుతోంది. అయితే.. జెనీలియా తన సినిమాల్లో వార్తల్లో నిలువకున్న పర్సనల్ లైఫ్ లో మాత్రం వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో పలుసార్లు జెనీలియా మూడోసారి గర్భవతి అంటూ వార్తలు వచ్చినా, జంట స్వయంగా స్పందించి వాటిని రూమర్లుగా ఖండించారు. అయితే ఈసారి రితేష్ దేశ్‌ముఖ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో మరోసారి వార్తల దారిన సాగుతోంది. బేబీ బంప్ కనిపించేలా ఉన్న ఓ ఫోటోలో కనిపించడంతో నెట్టింట్లో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే? ఇటీవల నటి జెనిలీయా తన భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి ముంబైలో ఒక నైట్ పార్టీకి అటెండ్ అయ్యింది. అదే సమయంలో జెనిలీయా భర్తతో కలిసి మీడియాకు పోజులిచ్చారు. ఈ ఫొటోలే నెట్టింట చర్చకు దారి తీశాయి. జెనీలియాకు కాస్త బేబీ బంప్ ఉన్నట్లు కనింపించింది. అంతేకాకుండా జెనిలీయా కూడా పదే పదే పొట్టపై చేతి పెట్టుకోవడంతో ఆమె తల్లి కాబోతోంది అంటూ రూమర్స్ వ్యాపించాయి. దీంతో జెనిలీయా ప్రెగ్నెన్సీ అంటూ. మూడో బిడ్డకు జన్మనివ్వనుంది అంటూ రూమర్స్ ప్రారంభమయ్యాయి.
జెనిలీయా - రితేష్ జంటకు ఈ రూమర్లు కొత్తేమి కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి పుకార్లు షికార్లు చేశాయి. గతంలో హీరో రితేష్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ సరదాగా రియాక్ట్ అయ్యారు. "నాకూ ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాలన్న ఆశ ఉంది, కానీ ఇది నిజం కాదు. ఆ కథనాలు పూర్తిగా రూమర్లు మాత్రమే" అంటూ హాస్యంగా రూమర్లకు బ్రేక్ ఇచ్చారు. తాజాగా మరోసారి పుకార్లు షికార్లు చేయడంతో ఈ రూమార్స్ పై ఎలా స్పందిస్తారో ఉండాలి. అభిమానులు అయితే మరోసారి తల్లిదండ్రులు అవుతారని ఆశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ జెనీలియా పేరు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











