నాగచైతన్య సరసన ఆ చిత్రంలో జెనిలియాను తీసుకుంటున్నారా
నాగచైతన్య హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న బెజవాడ రౌడీలు చిత్రం షూటింగ్ విజయవాడలో జరుగుతున్న సంగతి తెలిసిందే. బెజవాడ రౌడీయిజం చుట్టూ తిరిగే ఈ చిత్రంలో నాగచైతన్య సరసన జెనిలియాను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఈ చిత్రంతో వివేక్ కృష్ణ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై వర్మ చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం జెనీలియా తెలుగులో రానాతో కలిసి 'నా ఇష్టం' చిత్రం చేస్తోంది. అలాగే బాలీవుడ్‌లో 'ఫోర్స్'చిత్రంలోనూ, తమిళంలో 'వేలాయుధం'లోనూ నటిస్తోంది. మలయాళంలో నటించిన 'ఉరుమి' చిత్రం ఇటీవలే విడుదలై హిట్ టాక్ తో రన్ అవుతోంది. ఆరెంజ్ దెబ్బతో తెలుగులో లేకుండా పోతుందనుకున్న ఆమె మళ్ళీ తెలుగలో రీఎంట్రీ ఇచ్చి అవకాశాలుతో ముందుకువెళ్లుతోంది.


Click it and Unblock the Notifications











