రామ్ చరణ్ కోసం బికినీలో జెనీలియా?
రామ్ చరణ్ తేజ తాజా చిత్రం ఆరెంజ్ లో జెనీలియా బికినీలో కనిపించనుందంటూ వార్తలు వినపడుతున్నాయి. అయితే దానికి కారణం ఆమె రీసెంట్ గా ఇచ్చిన స్టేట్ మెంట్ అనీ, అలాగే ఆరెంజ్ లో ఆమె చేసే క్యారెక్టర్ అని చెప్తున్నారు. ఆమె బికినీ గురించి మాట్లాడుతూ...దర్శక, నిర్మాతలు చెబితే హీరోయిన్స్ కి బికిని దరించక తప్పదు. అయితే కథ ప్రకారం డిమాండ్ చేస్తుందో లేదో చూసుకోవాలి. నేను కూడా ఇలాంటి సిట్యువేషన్ ని ఎదుర్కొనేలా ఉన్నాను అంది. అలాగే రామ్ చరణ్ తాజా చిత్రం ఆరెంజ్ లో ఆమె పాత్ర ఆస్ట్రేలియాలో నివసించే ఆల్ట్రా మోడ్రన్ ట్రెండి గర్ల్. గ్రాఫిటి ఆర్టిస్టు రామ్ చరణ్ తో ప్రేమలో పడుతుంది. అందరికీ నో చెప్పే జెనీలియా...రామ్ చరణ్ కి యస్ చెప్పేందుకు ఎదురుచూస్తుంది. అయితే రామ్ చరణ్ పాత్ర తనకై తాను వెతుకుతూ వచ్చే అమ్మాయితో గడిపే పాత్ర. ఇక పాత్ర ప్రకారం ఆమె స్విమ్ సూట్లో కనపిస్తుందని అంటున్నారు. జెనీలియా దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆ స్టేట్ మెంట్ విసిరిందని చెప్తున్నారు. అంటే త్వరలో ఆమె అభిమానుల అదృష్టం బాగుంటే ద్రోణలో ప్రియమణిలా బికినీలో కనిపిస్తుందన్నమాట.


Click it and Unblock the Notifications











