జెనీలియా టాయిలెట్ గొడవ
హాట్ స్టార్ జెనీలియా పై బాలీవుడ్ మీడియా మొత్తం ఒక్కసారిగా దృష్టిపెట్టింది.ఆమె ఆ మధ్య ఓ తెలుగు సినిమా షూటింగ్ లో ఉండగా తన కార్వాన్ ని వేరే వాళ్ళు ఉపయోగించుకోవటంతో గొడవచేసిందంటూ న్యూస్ స్పెడ్ చేసేసాయి. ఇంతకీ ఆ రోజు జరిగింది వేరే విధంగా ఉంది. జెనీలియా కోసం యూనిట్ కేటాయించిన కార్వాన్ టాయిలెట్ ని మరో క్యారెక్టర్ నటి హేమ ఉపయోగించుకోవటం జరిగింది. ఎలాగూ జెనీలియా షాట్ బిజీలో ఉంది కదా అని డైరక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాస్సేపటికి షాట్ ఓ.కే చేయించుకుని కార్వాన్ లోపలకి వచ్చిన జెనీలియా లోపల ఎవరో ఉండటం తో కంగారుపడి అరిచింది.
కాస్సేపటికి అస్సలు విషయం తెలుసుకుని శాంతించింది. కానీ ఇక్కడ దాకానే సీన్ ని కట్ చేసి బాలీవుడ్ మీడియా దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది. అందులోనూ జానేతూ హిట్ తో జెనీలియా అక్కడ పాపులర్ స్టార్ అయిపోయింది. కాబట్టి ఈ న్యూస్ కి ఇంత ప్రయారిటీ ఇచ్చారు.ప్రస్తుతం జెనీలియా జస్ట్ ఎల్లో గుణ్ణం గంగరాజు చిత్రం కమిటయ్యింది. శ్రీనివాస్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. కృష్ణవంశి శశిరేఖా పరిణయం తర్వత జెనీలియా చేస్తున్న చిత్రం ఇదే.


Click it and Unblock the Notifications











