twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నాఇష్టం' నిర్మాతకు జెనీలియా ట్విస్ట్

    By Srikanya
    |

    ఆరెంజ్ సినిమా సమయంలో జెనీలియాపై నాగబాబు ఫైర్ అయన సంగతి తెలిసిందే.దాంతో ఆమెను తెలుగులో బుక్ చేయటానికి ధైర్యం ఎవరూ చెయ్యలేదు. కానీ రాణా రికమెండేషన్ తో ఆమె సీన్ లోకి వచ్చింది. ఆమె హీరోయిన్ గా రాణా హీరోగా నా ఇష్టం చిత్రం సినిమా ప్రారంభమైంది. అయితే ఇప్పుడా చిత్రం షూటింగ్ జరగటం లేదు. దానికి జెనీలియా డేట్స్ లేవని రాణా ..తన చిత్రం డిపార్టమెంట్ లో బిజీగా ఉన్నాడని చెప్తున్నారు.అయితే కారణం వేరే ఉందని తెలుస్తోంది. జెనీలియాతో షూటింగ్ నిమిత్తం నా ఇష్టం షూటింగ్ కి మలేషియాకు వెళ్లిన యూనిట్ కు ఆమె ఫ్లైట్ ఎక్కగానే ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తోంది.దానికి కారణం జెనీలియాకు బిజెనెస్ క్లాస్ లో టికెట్ తీస్తే, ఆమె తల్లికి ఎకానిమీ క్లాస్ లో టికెట్ తీసారు. అది తెలుసుకున్న ఆమె యూనిట్ పై ఫైర్ అయ్యిపోయింది.దానికి కారణం నిర్మాతలు చెప్పేదేమిటంటే రీసెంట్ గా నిర్మాతల మండలి పెట్టిన రూల్ అంటున్నారు.

    అందుప్రకారం.. హీరోయిన్స్ కి ఎస్కార్ట్ గా వచ్చే వాళ్ల తల్లుల ఖర్చులుని నిర్మాతలు భరించాల్సిన పనిలేదు.ఆమె ఫ్లైట్ ఎక్కిన తర్వాత తన తల్లి టిక్కెట్ ని బిజెనెస్ క్లాస్ కి అప్ గ్రేడ్ చేయమని గొడవ పెట్టింది. అంతేగాకన తన ప్రక్కనే తన తల్లి ఉండేటట్లు ఏర్పాట్లు చెయ్యాలని కోరింది. అయితే చివరి నిముషంలో యూనిట్ వారు చెయ్యలేకపోయారు. దాంతో అది మనస్సులో పెట్టుకున్న ఆమె మలేషియా షూటింగ్ లో ఇబ్బందులు పెట్టిందని,దాంతో దర్శకుడు అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్ జరగలేదని చెప్తున్నారు. మరో ప్రక్క నిర్మాత మాత్రం డైరక్షన్ డిపార్టమెంట్ మీద, యూనిట్ మీద ఈ విషయమై ఫైర్ అవుతన్నారని వారు గోలెత్తుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. రాణా మాత్రం కూల్ గా తనకేమీ సంభందం లేదన్నట్లు రామ్ గోపాల్ వర్మ డిపార్టమెంట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

    English summary
    Genelia blasted the production team of Naa Ishtam few minutes before her flight is ready to take off for Malaysia for a lengthy schedule.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X