Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జెనీలియా జంప్ జిలానీ
బబ్లీ గర్ల్ జెనీలియా తొలి చిత్రంతోనే తెలుగు 'బోయ్స్" హృదయాలను కొల్లగొట్టి, బాలీవుడ్లో సైతం కలలరాణిగా వెలిగిపోతోంది. బొమ్మరిల్లు సినిమాలో వీలైతే బోలెడు మాటలు, కుదిరితే కప్పు కాఫీ డైలాగ్ తో అందరినీ ఆకట్టుకున్న బబ్లీగర్ల్ జెనీలియా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. ఇటీవల జెనీలియా అబ్బాస్ తైర్వాలా దర్శకత్వంలో ఇమ్రాన్ ఖాన్ తో నటించిన'జానే తూయా జానేనా" చిత్రం సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్ లో జెనిలియాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం జెనీలియా డేట్స్ కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతుండగా ప్రముఖ హీరోల సరసన అవకాశాల వెల్లువ జెనీలియాను వెన్నంటుతున్నాయి. ఏ హీరోయిన్‌కైనా అంతిమ గోల్ బాలీవుడ్. ఇప్పటికే ఆసిన్ బాలీవుడ్లో పాగా వేయగా ఈ మధ్యే త్రిష కూడా కాలు మోపుటకు ట్రై చేస్తోందని సమాచారం.
ఆసిన్ లాగే జెనీలియా సౌత్ సినిమాలు తగ్గించుకుని బాలీవుడ్ లోనే సెటిలయ్యే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెనీలియా తెలుగుకు దూరం కానుందా? అనే ప్రశ్న వెల్లువలా వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే దక్షిణాది ప్రేక్షకులకు జెనీలియా దూరమైనట్లే అని అంతా భావిస్తున్నారు. దానికి సమాధానం కూడా అవుననే అంటున్నారు చాలా మంది. 'హాసిని"గా తెలుగు హృదయాల్లో చెరగని ముద్ర వేసిన జెనీలియా ప్రస్తుతం 'కథ" అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రంలో జెనీలియా 'టీచర్"గా కనపడనుంది తన నట జీవితంలో డిప్రెంట్ గా ఎప్పుడూ ట్రైచేయని పాత్రను ఈ చిత్రంలో చేస్తుందని ఈ చిత్రం అతి త్వరలో విడుదలకు సిద్దం కాబోతుంది.