twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జెనీలియా జంప్ జిలానీ

    By Staff
    |

    బబ్లీ గర్ల్ జెనీలియా తొలి చిత్రంతోనే తెలుగు 'బోయ్స్‌" హృదయాలను కొల్లగొట్టి, బాలీవుడ్‌లో సైతం కలలరాణిగా వెలిగిపోతోంది. బొమ్మరిల్లు సినిమాలో వీలైతే బోలెడు మాటలు, కుదిరితే కప్పు కాఫీ డైలాగ్ తో అందరినీ ఆకట్టుకున్న బబ్లీగర్ల్ జెనీలియా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. ఇటీవల జెనీలియా అబ్బాస్ తైర్వాలా దర్శకత్వంలో ఇమ్రాన్ ఖాన్ తో నటించిన'జానే తూయా జానేనా" చిత్రం సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్ లో జెనిలియాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం జెనీలియా డేట్స్‌ కోసం బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతుండగా ప్రముఖ హీరోల సరసన అవకాశాల వెల్లువ జెనీలియాను వెన్నంటుతున్నాయి. ఏ హీరోయిన్‌కైనా అంతిమ గోల్‌ బాలీవుడ్‌. ఇప్పటికే ఆసిన్‌ బాలీవుడ్‌లో పాగా వేయగా ఈ మధ్యే త్రిష కూడా కాలు మోపుటకు ట్రై చేస్తోందని సమాచారం.

    ఆసిన్ లాగే జెనీలియా సౌత్ సినిమాలు తగ్గించుకుని బాలీవుడ్ లోనే సెటిలయ్యే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెనీలియా తెలుగుకు దూరం కానుందా? అనే ప్రశ్న వెల్లువలా వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే దక్షిణాది ప్రేక్షకులకు జెనీలియా దూరమైనట్లే అని అంతా భావిస్తున్నారు. దానికి సమాధానం కూడా అవుననే అంటున్నారు చాలా మంది. 'హాసిని"గా తెలుగు హృదయాల్లో చెరగని ముద్ర వేసిన జెనీలియా ప్రస్తుతం 'కథ" అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రంలో జెనీలియా 'టీచర్‌"గా కనపడనుంది తన నట జీవితంలో డిప్రెంట్ గా ఎప్పుడూ ట్రైచేయని పాత్రను ఈ చిత్రంలో చేస్తుందని ఈ చిత్రం అతి త్వరలో విడుదలకు సిద్దం కాబోతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X