ఆర్తి అగర్వాల్ ని ముంచిన పోసాని
నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలతో అదరకొట్టిన ఆర్తి అగర్వాల్ రీ ఎంట్రీ మాత్రం ఏం బాగుండలేదంటున్నారు. ఓ ప్రక్క భర్తకు విడాకులు ఇచ్చే ప్రాసెస్ లో ఉన్న బొద్దు గుమ్మ(ముద్దు ఎప్పుడో పోయింది) తాజాగా ఆమె నటించిన జెంటిల్ మెన్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో బెంగ పెట్టుకుంది. తాను ఓ అద్బుతం తీస్తున్నానని అతి తక్కువ రేటుకు ఆర్తి అగర్వాల్ ను ఒప్పించి, నటింపచేసిన పోసాని ఆమెను ముంచాడని అంటున్నారు. అందులోనూ మరో ప్రక్క ఆమెతో సినిమా ప్రారంభించిన దర్శకుడు భరత్ తర్వాత ఆ షూటింగ్ ఊసే ఎత్తక పోవటం ఆమెకు బెంగపట్టుకుంది. దాంతో ఆమెకు ఏమీ దిక్కు తోచని స్ధితి ఏర్పడింది అంటున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒకటి రెండు చిత్రాల్లో ఆఫర్ వచ్చినా పోసాని మీద నమ్మకంతో ఆమె ఏదీ కమిట్ కాలేదు. దాంతో ఓ రకంగా ఆమెకు పోసాని చిత్రం పెద్ద ఎదురు దెబ్బే అని సీనియర్స్ విశ్లేషిస్తున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభం బాగోపోతే ఇక కెరీర్ దాదాపు సమాప్తమైనట్లేనని చెప్తున్నారు. కొత్త చిత్రాలు ఏమీ ఆమెకు రావటం లేదు. అలాగే ఆమెను ఒకప్పుడు ఆదరించిన హీరోలు, దర్శక, నిర్మాతలు ఎవరూ చివరకు ఆమె నుంచి ఫోన్ వస్తే లిప్ట్ కూడా చెయ్యటం లేదట. బ్యాడ్ సిట్యువేషన్ కదా.


Click it and Unblock the Notifications











