GHAATI పవర్‌ఫుల్ క్రిమినల్‌గా అనుష్క శెట్టి.. జేజమ్మ కోసం క్రిష్ ఛాలెంజింగ్ స్క్రిప్ట్‌తో!
టాలీవుడ్‌లో హీరోలతో సమానంగా స్టార్‌డమ్‌ను అందుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనతో మాయ చేసిన ఈ సుందరాంగి.. చాలా కాలం పాటు వరుస చిత్రాలతో సందడి చేసింది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం అనుష్క కాస్త స్లోగానే మూవీలను లైన్‌లో పెట్టుకుంటోంది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో గత ఏడాది వచ్చి సక్సెస్ సాధించిన అనుష్క శెట్టి.. ఇప్పుడు మలయాళంలో ఓ మూవీని చేస్తోంది. దీనితో పాటు ప్రస్తుతం ఈ భామ.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. గతంలో వీళ్ల కాంబోలో 'వేదం' వంటి మూవీ రావడంతో దీనిపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

క్రేజీ సబ్జెక్టుతో రాబోతున్న సినిమాకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్‌లో షూట్‌ను జరుపుతున్నారు. దీని తర్వాత ఒడిశా వెళ్లి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, మూవీ స్టోరీలైన్ వివరాలు బయటకు వచ్చేశాయి.
అనుష్క శెట్టి - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రాబోతుందట. ఓ అనుకోని ఘటన వల్ల ఓ రొచ్చులో చిక్కుకుని అన్యాయానికి గురైన అమ్మాయి.. శత్రువులను మట్టబెట్టే క్రిమినల్‌గా ఎలా మారింది అన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం.

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి 'ఘాటి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని చెప్తున్ారు. 'ఘాటి' అంటే లోయ అని అర్థం. ఆ నేపథ్యంతోనే ఈ చిత్రం రూపొందుతోందన్న మాట. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతూనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. అనుష్క శెట్టి - క్రిష్ జాగర్లమూడి కలిసి చేస్తున్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











