విజయ్ దేవరకొండ ముందే అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన.. చేసేందేం లేక..

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అవుతోంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో విజయ్ అండ్ కో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముగించేసింది.

ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ వినూత్న రీతిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేయడం.. మ్యూజికల్ ఫెస్ట్ పేరిట షోలు నిర్వహించడం వంటివి చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా విజయ్ ప్రొఫెషనల్ డ్యాన్స్‌తో పాటు డీజే పాటలకు తీన్మార్ స్టెప్పులు వేసి అదరగొట్టాడు. అలాగే, పాటలు పాడడం.. తబలా కూడా వాయించాడు. మరోపక్క, రష్మిక కూడా అదే స్థాయిలో డ్యాన్సులు, పాటలతో మెప్పించింది.

Girls Face Problems In Dear Comrade Music Fest

ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ భారీ స్థాయిలో హాజరయ్యారు. దీంతో అక్కడ ఊహించని పరిణామాలు జరిగాయని తెలుస్తోంది. విజయ్‌ను దగ్గర నుంచి చూడాలని వచ్చిన యువతులతో ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారట. తోపులాట నెపంతో అమ్మాయిలను నలిపేశారని తెలిసింది. అమ్మాయిలపై ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తూ వారిని తెగ ఇబ్బంది పెట్టారని సమాచారం. అంతేకాదు, స్టేజ్ దగ్గర్లో బౌన్సర్లు ఉన్నా.. ఏమీ చేయలేకపోయారని షోకు వెళ్లిన వారు చెబుతున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. ఈ విషయం బయటకు చెబితే తమకే ఇబ్బంది అని భావించిన సదరు యువతులు కామ్‌గా ఉండిపోయారని తెలుస్తోంది.

ఇక, ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా సెన్సార్ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. అంతేకాదు, ఈ సినిమా రన్‌ టైమ్ 2 గంటల 49 నిమిషాలు ఉంది. గతంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' కూడా దాదాపు మూడు గంటల రన్ టైమ్ ఉంది. లాంగ్ రన్ టైమ్ ఉన్నప్పటికీ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' కూడా అలాంటి మేజిక్‌నే క్రియేట్ చేస్తుందేమోనన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X