Mrunal Thakur: RRR హీరోతో జతకట్టే ఛాన్స్.. మృనల్ కు బిగ్ పాన్ ఇండియా ఆఫర్!
ఒకే ఒక్క సినిమాతో భారీ స్థాయిలో గుర్తింపు అందుకున్న హీరోయిన్స్ లలో మృనల్ ఠాగూర్ ఒకరు. ఈ బ్యూటీ ఇటీవల కాలంలో అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఆమెకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలు కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
హను రాగవపూడి డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో మృనల్ నటించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ బ్యూటీ తదుపరి సినిమాతో కూడా మెప్పించాలి అని అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నానితో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే మరికొంతమంది టాలీవుడ్ అగ్ర హీరోలతో కూడా అవకాశాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో సెల్ఫీ అనే సినిమా చేసింది. ఇక ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా ఈ బ్యూటీ చాలా హైలైట్ అవుతోంది. రీసెంట్ గా ఒక సాంగ్ విడుదల చేయగా అందులో అమ్మడు గ్లామర్ లుక్ తో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక మరోవైపు మృనల్ RRR హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా జతకట్టే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
కొరటాల శివ దర్శకత్వంలో త్వరలోనే మొదలు కాబోతున్న NTR 30 ప్రాజెక్టు హీరోయిన్ రోల్ కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది అగ్ర హీరోయిన్స్ పేర్లు చర్చల్లోకి రాగా ఇప్పుడు మృనల్ ఠాగూర్ అయితే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇంకా ఈ విషయంలో అధికారికంగా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు కానీ త్వరలోనే మాత్రం మృనల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కొరటాల శివ ప్రణాళికలు రచిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











