అకిరా నందన్ సినీ ఎంట్రీపై రాంచరణ్ .. ఆ సినిమాతోనే అంటూ లీక్

మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో ఈ కుటుంబం నుంచి దాదాపు డజను మంది హీరోలు చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, సాయిథరమ్ దేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, కళ్యాణ్ దేవ్ వంటి వారు తమ సత్తా చాటుతున్నారు. ఇక గీతా ఆర్ట్స్, కొణిదెల ప్రొడక్షన్స్, అంజనా ప్రొడక్షన్స్ , ఆహా వంటి సంస్థలు మెగా కుటుంబానివే. ఏటా ఈ ఫ్యామిలీ పేరు మీదనే కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతూ.. ఎంతోమందికి ఉపాధి దొరుకుతోంది.

చిరంజీవి పిల్లలు, నాగబాబు పిల్లలు ఇండస్ట్రీలో సెట్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా , ఆద్యల ఎంట్రీ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో గోల చేస్తున్నారు.
గతంలో నేడు , రేపు .. కథ సిద్ధమంటూ వార్తలు హల్‌చల్ చేసినా ప్రచారంగానే తేలిపోయింది. అయితే అప్పటి పరిస్ధితులు వేరు.. ఇప్పుడు వేరు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయంలో కీలకపాత్ర పోషించిన జనసేనాని.. చంద్రబాబు కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Global star ram charan comments on akira nandan film debut at unstoppable with nbk season 4

రాజకీయాలు, పాలనలో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే తన సినీ కెరీర్‌కు గుడ్ బై చెప్పి ఫుల్‌టైం పొలిటీషియన్‌‌‌గా సెటిల్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. చేతిలో ఉన్న ఓజీ, హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను విడతల వారీగా కంప్లీట్ చేసి పూర్తి సమయాన్ని రాజకీయాలు, ప్రజాసేవకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

దీంతో పవన్‌ను తాము అకీరా నందన్‌లో చూసుకుంటామని , వీలైనంత త్వరగా కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా పవర్‌స్టార్‌పై ఒత్తిడి పెంచుతున్నారు అభిమానులు. అకీరాను హీరోగా పరిచయం చేయడానికి ఇదే సరైన సమయమనే వాదనలు వినిపిస్తున్నారు. దాదాపు 6.4 హైట్‌తో అచ్చు గుద్దినట్లు పవన్ కళ్యాణ్‌లా ఉండే అకీరా నందన్‌లో హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి.

కానీ అకీరా గడిచిన కొద్దిరోజులుగా తన తండ్రి పవన్ కళ్యాణ్‌కు తోడుగా ఉంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అకీరా నందన్‌పై ఫ్యాన్స్, పబ్లిక్ ఫోకస్ ఎక్కువగా ఉండటంతో ఆయను హీరోగా లాంచ్ చేసేందుకు ఇదే సరైన సమయమని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే హీరోకు కావాల్సిన అన్ని రకాల శిక్షణా కార్యక్రమాలను అకీరా తీసుకుంటున్నారు.

తాజాగా ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌గా వచ్చిన రామ్ చరణ్ తేజ్‌ను అకీరా ఎంట్రీపై ప్రశ్నించారు . అకీరా వాళ్ల నాన్నలాగే బుక్స్ ఎక్కువ చదువుతాడని, భారతదేశ సంస్కృతిపై మంచి నాలెడ్జ్ ఉందని చెర్రీ చెప్పారు. పియానో అద్భుతంగా వాయిస్తాడని.. మా ఫ్యామిలీలో నాతో బాగా క్లోజ్‌గా ఉండే అకీరా.. నా బర్త్ డేకు బుక్స్ కానుకగా ఇస్తాడని చరణ్ వెల్లడించారు. అన్ని కుదిరితే త్వరలోనే అకీరా నందన్ ఎంట్రీ ఈ ఏడాది కానీ, వచ్చే ఏడాది కానీ ఉండొచ్చంటూ లీక్ చేశాడు గ్లోబల్ స్టార్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X