twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    God Father లో గద్దర్!.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ప్రజా యుద్ధనౌక!

    |

    లయాళంలో ఘన విజయం సాధించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ హీరోగా నటించగా, ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైన చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ చిత్రంలో గద్దర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారనే విషయం అత్యంత చర్చనీయాంశమైంది. ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ చిత్ర వివరాల్లోకి వెళితే..

     కోవిడ్ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా

    కోవిడ్ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా

    లూసిఫర్ రీమేక్ చిత్రానికి తొలుత సాహో దర్శకుడు సుజిత్ రెడ్డి పేరు విస్తృతంగా ప్రచారమైంది. అయితే అనూహ్యంగా తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరపైకి వచ్చారు. చిరంజీవితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి మోహన్ రాజా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం ఎన్‌వీ ప్రసాద్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. కోవిడ్ ప్రోటోకాల్స్ అనుసరిస్తూ ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు.

    చిరంజీవి బర్త్ డే సందర్భంగా టైటిల్ ప్రకటన

    చిరంజీవి బర్త్ డే సందర్భంగా టైటిల్ ప్రకటన

    హైదరాబాద్‌లో కొద్ది రోజులుగా లూసిఫర్ రీమేక్ షూటింగు జరుగుతున్నది. అయితే చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి గాడ్‌ఫాదర్ అనే పేరు పెట్టారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందిస్తున్న నిరవ్ షా డేట్స్ కుదరకపోవడంతో వైజాగ్‌లో జరుగాల్సిన ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అజిత్ హీరోగా, తెలుగు హీరో కార్తీక్ గుమ్మకొండ విలన్‌గా నటిస్తున్న వాలిమై చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రఫి అందించడం, ఆ షూటింగ్ విదేశాల్లో ఉండటం వల్ల గాడ్ ఫాదర్ సినిమా షూటింగును కొద్ది రోజులు వాయిదా వేశారు.

    వైజాగ్‌లో షూటింగ్ వాయిదా

    వైజాగ్‌లో షూటింగ్ వాయిదా

    వాస్తవానికి గాడ్ ఫాదర్ సినిమా తదుపరి షెడ్యూల్‌లో వైజాగ్‌కు సమీపంలోని జైలులో జరగాల్సి ఉంది. జైలు సీన్లలో భాగంగా చిరంజీవి, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. అయితే నిరవ్ షా కారణంగా ఈ సీన్ల చిత్రీకరణ వాయిదా వేశారు. ఈ సీన్లు ఎమోషనల్ కంటెంట్‌తోనే కాకుండా సినిమాలో కీలకమైన మలుపుకు కారణమవుతాయని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

    గాడ్ ఫాదర్‌లో గద్దర్ కీలక పాత్ర

    గాడ్ ఫాదర్‌లో గద్దర్ కీలక పాత్ర

    ఇక వైజాగ్ జైలులో చిత్రీకరించే సన్నివేశాల్లో మెగాస్టార్ చిరంజీవితోపాటు సినిమాలో నటించే కొందరు ముఖ్యమైన నటులు పాల్గొంటారు. అయితే ఈ చిత్రంలో ప్రజా యుద్ధనౌక, జననాట్యమండలి కళాకారుడు గద్దర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు అనే విషయం బయటకు వచ్చింది. అయితే చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన అధికారికంగా వెల్లడి కాలేదు.

    Recommended Video

    Producer Kalaipuli S Dhanu About Narappa Movie | Filmibeat Telugu
    ప్రజా యుద్ధనౌక గద్దర్ గురించి సంక్లిప్తంగా

    ప్రజా యుద్ధనౌక గద్దర్ గురించి సంక్లిప్తంగా

    ఇక గద్దర్ విషయానికి వస్తే ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. కవి, ప్రజా సమస్యలపై గళం విప్పిన విప్లవ నేత, మాజీ నక్సలైట్‌గా అందరికి సుపరిచితులు. 2010 వరకు నక్సలైట్ ఉద్యమంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పాల్గొన్నారు. 1997 సంవత్సరంలో గద్దర్‌పై కొందరు అగంతకులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజా ఫ్రంట్ పార్టీని ప్రారంభించారు. ప్రస్తుతం వామపక్ష భావజాలానికి దూరంగా ఉంటున్న గద్దర్ సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. గతంలో పలు సినిమాలకు పాటల రాసి, పాడిన ఆయన కొన్ని సినిమాల్లో తెరపైన కనిపించారు. తాజాగా చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో జైలులో మగ్గుతున్న నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

    English summary
    Chiranjeevi's God Father movie Shooting cancelled due various reasons. As per reports, Rebel balladeer Gaddar is playing a crucial role in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X